తమిళ నటుడు సూర్య ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న మంచి విజయాలు మాత్రం ఈయనకు దక్కడం లేదు. కొంత కాలం క్రితం ఈయన శివ దర్శకత్వంలో కంగువా అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ భారీ అపజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈయన కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన రెట్రో అనే సినిమాలో హీరోగా నటించాడు. పూజా హెగ్డేమూవీ లో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. మరి ముఖ్యంగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రం దారుణంగా విఫలం అయింది. సూర్య కు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉండడంతో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ ఈ మూవీ కి మంచి టాక్ రాకపోవడంతో ఈ సినిమా పెద్ద స్థాయి కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేయలేకపోతోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున నష్టాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన 13 రోజులు బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 13 రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఎన్నో తెలుసుకుందాం.

మూవీ కి 13 రోజుల్లో నైజాం ఏరియాలో 1.48 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 46 లక్షలు , ఆంధ్ర లో 1.76 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 13 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.70 కోట్ల షేర్ ... 7.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10.50 కోట్ల భారీ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 6.80 కోట్ల షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: