తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనకు బాగా తెలిసిన హీరోలలో  ప్రభాస్ ఐదు పదుల వయసు దగ్గరికి వస్తున్నాడు. అయినా ఆయన పెళ్లిపై ఉసెత్తడం లేదు. ఇక హీరోయిన్లలో  అనుష్క శెట్టి, త్రిష, తమన్నా కూడా ఎంతో వయసు వచ్చిన పెళ్లికి దూరం అవుతూ వస్తున్నారు. ఇక వీళ్లే కాకుండా తమిళ ఇండస్ట్రీలో  ఎంతో ఫేమస్ అయిన హీరో శింబు కూడా ఇదే దారిలో వెళ్తున్నారు. నాలుగు పదుల వయసు దాటినా కానీ ఇంకా పెళ్లి ఊసెత్తాడం లేదు. ప్రస్తుతం ఈయన తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఎంతో ఫేమస్ హీరో గా ఉన్నాడు. ఎంత పేరు తెచ్చుకున్నాడో వివాదాల్లో కూడా అంతకంటే ఎక్కువ ఇరుక్కుంటూ ఉంటాడు. ఆ విధంగా శింబు  హీరో గానే కాకుండా డాన్సర్ గా, సింగర్ గా కూడా పాపులారిటీ పొందారు. 

ప్రస్తుతం ఈయనకు రజనీకాంత్ కు ఏ విధమైనటువంటి పేరు ఉందో ఆ లెవల్ లోనే పేరు సంపాదించుకున్నారని చెప్పవచ్చు.  ఈ విధంగా కెరియర్ లో మంచి పొజిషన్ లో ఉన్నటువంటి శింబు పెళ్లి విషయంలో మాత్రం చాలా వెనుకబడిపోయారని చెప్పవచ్చు. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం  ఆయన త్వరలో పెళ్లి పీటలేకపోతున్నారని తెలుస్తోంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ఈ హీరో థగ్ లైఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా  ఓ కాలేజీకి వెళ్ళాడు.

ఈ తరుణంలో చాలామంది విద్యార్థులు మీ పక్కన మీ జీవిత భాగస్వామిని చూడాలనుకుంటున్నామని ప్రశ్నించారు. దీంతో శింబు చిరునవ్వుతో  సమాధానం ఇచ్చారు. దీన్నిబట్టి చూస్తే ఆయన త్వరలోనే పెళ్లి పీటలేక్కబోపోతున్నారని అర్థమవుతుంది. ఈమధ్య ఆయన నిధి అగర్వాల్ తో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. మరి నిజంగానే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నారా, అందుకే ఆ చిరునవ్వు నవ్వరా అంటూ నేటిజన్లు భావిస్తున్నారు. అమ్మాయి నిధి అగర్వాల్ ఏనా లేదంటే కొత్త అమ్మాయిని చేసుకోబోతున్నారా అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: