తెలుగు అందాల న‌టుడు సోగ్గాడు శోభన్ బాబు ఆయన తరంలో రారాజుగా ఏలాడు .. తెలుగు చిత్ర పరిశ్రమ అగ్ర హీరోల్లో ఒకరిగా నిలిచిన శోభన్ బాబు అప్పట్లో భారీగా అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు .. ఎన్టీఆర్ , కృష్ణ , కృష్ణంరాజు వంటి దిగ్గజా హీరోలతో పాటు ఆయన తన ఉనికిని కొన్ని దశాబ్దాల పాటు అగ్రస్థానంలో చాటుకున్నారు .. ఇద్దరు హీరోయిన్లతో నారీ నారీ నడుమ రొమాంటిక్ బాయ్ పాత్రలు చేయటంతో శోభన్ బాబు తర్వాత ఎవరైనా అనే విధంగా రికార్డులు క్రియేట్ చేశారు .. లాయర్ కాబోయే యాక్టర్ గా మారారు శోభన్ బాబు ..


అయితే ప్రస్తుతం మన తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తమ వారసుల్ని హీరోలుగా పరిచయం చేస్తున్న సమయంలో శోభన్ బాబు లాంటి అగ్ర హీరో కుటుంబం నుంచి ఎవరూ చిత్ర పరిశ్రమకు రాకపోవటం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది . ఆయన తర్వాత ఆయన కొడుకు కానీ మనవడు కానీ చిత్ర పరిశ్రమలోకి రాలేదు .. కానీ శోభ‌న్‌ బాబు కుటుంబం నుంచి కొందరు విదేశాలలో స్థిరపడ్డారని రకరకాల వృత్తుల్లో రాణిస్తున్నారని పలు కథనాలు వచ్చాయి .. అయితే ఇప్పుడు చాలా రోజులకి శోభన్ బాబు మనవడు , కుమార్తె మృధుల కుమారుడు సురక్షిత్ డాక్టర్ వృత్తిలో ఉన్నటు ప‌లు మీడియా ఛానల్లో ఇంటర్వ్యూలు చేయటం కొంత ఆస్తిని కలిగించింది ..


అయితే అతను నటుడు కాకపోవడానికి కారణాలను కూడా రీసెంట్గా చెప్పుకొచ్చాడు .. అయితే ఆయన పదో తరగతిలో ఉండగానే నటనలోకి రావాల్సిందిగా అవకాశాలు వచ్చాయని కానీ ఆసక్తి లేదని కూడా చెప్పకు వచ్చారు. చాలామంది దర్శక నిర్మాతలు నన్ను సంప్రదించారు అంతేకాకుండా తాత శోభన్ బాబును ప్రజలు సోగ్గాడిగా చూస్తారు సక్సెస్ఫుల్ హీరోగా మాత్రమే గుర్తుంచుకుంటారు కానీ ఈ విజయం అంత సులువుగా రాలేదు .. ఆయన ఎంతో కష్టపడ్డాకే హీరోగా రాణించారని డాక్టర్ సురక్షిత్ తెలిపాడు .. తాత గారి కష్టాలన్నిటిని చూసాము కాబట్టి సినీ రంగంలోకి వెళ్లాలని మాకు అనిపించలేదని ఆయన చెప్పుకొచ్చాడు .. ప్రస్తుతం సురక్షిత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: