నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాని ఇప్పటి కే ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన విజయాలను ఎన్నింటి నో అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే నాని హీరో గా రూపొందిన హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది . మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా ఇప్పటికే మంచి కలెక్షన్లను వసూలు చేసి బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కూడా కంప్లీట్ చేసుకోవడం మాత్రమే కాకుండా భారీ లాభాలను కూడా అందుకుంది.

మూవీ మరికొన్ని రోజుల పాటు అద్భుతమైన కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఇకపోతే నాని తన తదుపరి మూవీ ని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ కి ది ప్యారడైజ్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఈ మూవీ కి సంబంధించిన ఒక వీడియోను కూడా ఇప్పటికే మేకర్స్ విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నాడు. ఈ మూవీ కి అనిరుద్ సంగీతం అందించనుండడంతో ఈ మూవీ మ్యూజిక్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే ఈ మూవీ యొక్క మ్యూజిక్ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క సంగీత హక్కులను సరిగమ సంస్థ వారు ఏకంగా 18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా ది ప్యారడైజ్ మూవీ సంగీత హక్కుల అత్యంత భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: