విక్టరీ వెంకటేష్ గత కొంత కాలంగా సరైన విజయం లేక బాక్సా ఫీస్ దగ్గర తడపడుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలాంటి సమయం లోనే వెంకటేష్ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ద్వారా నిర్మాతలకు పెద్ద ఎత్తున లాభాలు వచ్చాయి. మరి ఈ సినిమా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి లాభాలను అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 43.02 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 19.0 కోట్లు , ఉత్తరాంధ్రలో 22.60 కోట్లు , ఈస్ట్ లో 13.80 కోట్లు , వెస్ట్ లో 9.01 కోట్లు , గుంటూరులో 10.40 కోట్లు , కృష్ణ లో 9.70 కోట్లు , నెల్లూరులో 4.90 కోట్ల కనెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 132.63 కోట్ల షేర్ ... 217.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 9.05 కోట్ల కలెక్షన్లు దక్కగా ... ఓవర్సీస్ లో 17.05 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 158.73 కోట్ల షేర్ ... 275.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే 42.50 కోట్ల టార్గెట్తో బాక్సా ఫీస్ బరిలోకి దిగిన ఈ మూవీ కి 116.23 కోట్ల లాభాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: