సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ హీరో ఫ్యాన్స్ ఆ హీరోని పొగుడుకోవడం మనం కామన్ గా చూస్తూ ఉంటున్నాం. ఆ హీరో తప్పు చేసిన సరే మా హీరో చేసింది తప్పు కానే కాదు ..మా హీరోల ఇంకెవరు తప్పు చేయలేదా అంటూ చేతులు దులుపుకునే అభిమానులు చాలానే ఉన్నారు.  మరీ ముఖ్యంగా స్టార్స్ ఫ్యాన్స్ ఆ విషయంలో ఎక్కడా తగ్గరు . తమ హీరో తప్పు చేసిన వెనకేసుకొచ్చే హీరోలు కొందరైతే తమ హీరో తప్పుని సమర్థించుకొని వెనకేసుకొచ్చేవాళ్ళు పరోక్షకంగా వేరే హీరోని టార్గెట్ చేసే వాళ్ళు కొందరు . కాగా రీసెంట్గా ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో బాలకృష్ణ పై జరుగుతున్న ట్రోలింగ్ అందరికీ తెలిసిందే . బాలకృష్ణ అంటే చాలామందికి ఇష్టం ఫేవరెట్ హీరోగా కూడా చెప్పుకొస్తూ ఉంటారు .


బాలకృష్ణ టైమింగ్.. రైమింగ్.. అల్లరి అందరికీ తెలిసిందే. బాలయ్యలో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి . ఒకప్పుడు మాస్ పాత్రలో మెప్పించిన బాలయ్య ఇప్పుడు క్లాస్ పాత్రలో మెప్పించడానికి చూస్తున్నారు . సెంటిమెంట్ పాత్రలో కూడా నటించి మెప్పిస్తున్నారు . అలాంటి బాలయ్యలో హోస్ట్ కూడా దాగున్నాడు అంటూ అన్ స్టాపబుల్ బయట పెట్టింది . అయితే ఇప్పుడు బాలయ్య ఒక యాడ్లో నటించి  తన పేర్కొన్న పబ్లిసిటీ పాపులారిటీ మొత్తం డౌన్ ఫాలో అయ్యేలా చేసుకుంటున్నాడు అంటూ కొంతమంది ఘాటుగాటుగా రియాక్ట్ అవుతున్నారు .



బాలకృష్ణ ఫేవరెట్ బ్రాండ్ ఏంటి అని అడిగితే కచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్పేది మెన్షన్ హౌస్ . చాలా మందికి ఇదే ఫేవరెట్ బ్రాండ్ . చీకటి పడితే చుక్క పడాల్సిందే అన్న వాళ్ళకి ఈ మెన్షన్ హౌస్ ఓ మంచి కిక్కిస్తుంది. చాలామందికి మ్యాన్షన్ హౌస్ అనే లిక్కర్ కంపెనీ కానీ మందు బాబులకి మాత్రం స్వరగానికి కేరాఫ్ అడ్రెస్..అంతేకాదు మాది మెన్షన్ హౌస్ అని చెప్పుకోవడానికి ఆ మందు రాయళ్లు ఏ మాత్రం వెనకడుగు వేయరు . మాది ఒక బ్రాండ్ అంటూ బాగా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు . కాగా ఇన్నాళ్లు అనధికారికగా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న బాలయ్య ఇప్పుడు అధికారిక ప్రచారకర్తగా మారిపోయాడు .



మ్యాన్షన్ హౌస్ కంపెనీ దానికి సంబంధించిన వీడియోని కూడా రిలీజ్ చేశారు . సాధారణంగా చిన్నాచితకా స్టార్స్ ఇలాంటి మద్యం ప్రమోషన్ చేస్తే పెద్దగా పట్టించుకోరు జనాలు . బడా స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అది కూడా ఒక రాజకీయ నేత ప్రమోట్ చేస్తే మాత్రం రచ్చ రంబోలా చేసేస్తూ ఉంటారు . సోషల్ మీడియాలో ఒక పెద్ద రచ్చ రచ్చ క్రియేట్ చేస్తూ ఉంటారు . ఈ విషయంలో ఎవరి ఒపీనియన్ వాళ్ళది . మందు తాగే వాళ్ళకి అది ఓ మహా ప్రసాదంగా ఉంటుంది . మందు తాగని వాళ్ళకి అది ఒక పెద్ద బూతులా కనిపిస్తుంది.



అయితే పద్మభూషణ్ అవార్డు అందుకున్న లాంటి స్టార్ హీరో ఒక మందుని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్..? అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ మొదలైంది . కొంతమంది బాలయ్యకు సపోర్ట్ చేస్తుంటే మరి కొంత మంది మాత్రం బాలయ్యకు నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్లకి నందమూరి ఫ్యాన్స్ ఘాటుగానే రియాక్ట్ అయ్యి కౌంటర్స్ వేస్తున్నారు . చాలామంది స్టార్స్ పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటారు . కొంతమంది కండోమ్‌స్ లో కూడా నటించి పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు . లిక్కర్ యాడ్ లో కనిపిస్తే తప్పా..? అంటూ బాలయ్యను సపోర్ట్ చేసే జనాలు ఉన్నారు .



కొంతమంది పద్మభూషణ్ అవార్డు అనేది చాలా చాలా గౌరవం కలది అని .. అలాంటి అవార్డు అందుకొని బాలయ్య ఇలాంటి పని చేస్తాడు అని అసలు కలలో ఊహించలేకపోయాం అంటూ కొంతమంది నందమూరి ఫ్యాన్స్ కూడా మాట్లాడుతూ ఉండడం గమనార్హం. అయితే బాలయ్య మొదటి నుంచి విమర్శలు పట్టించుకునే టైపు కాదు.  తనకు అనిపించింది అనిపించినట్లు చేసేస్తాడు . పక్క వాళ్ళు ఏమనుకున్న ఐ డోంట్ కేర్ అనుకుంటాడు.  ప్రెసెంట్ అదే విధంగా ముందుకు వెళ్లి పోతున్నాడు కానీ సోషల్ మీడియాలో మాత్రం బాలయ్య పై ఫుల్ నెగిటివిటీ క్రియేట్ అయిపోయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: