
దేశంలోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న సంగీత దర్శకులలో ఒకరుగా అనిరుథ్ పేరు సంపాదించారు. తాజాగా నాని నటిస్తున్న ప్యారడైజ్ సినిమాకి రూ .15 కోట్ల రూపాయల వరకు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఆడియో రైట్స్ 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయట. దీన్ని బట్టి చూస్తే అనిరుథ్ పైన పెట్టిన పెట్టుబడి కూడా చిత్ర బృందానికి తిరిగి వచ్చినట్టుగానే కనిపిస్తోంది. మరొక సంగీత దర్శకుడు థమన్ కూడా ఒక్కో చిత్రానికి రూ .8కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ రూ.10కోట్ల రూపాయల వరకు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పుష్ప తో వచ్చిన క్రేజ్ తో ఒక్క సారిగా భారీ ధరకు ఆడియో రైట్స్ అమ్ముడుపోతున్నాయి. గతంలో ఏఆర్ రెహమాన్ ఆడియోకు మంచి డిమాండ్ ఉన్నట్లుగానే ఇప్పుడు అనిరుథ్ సంగీతానికి కూడా మంచి డిమాండ్ ఏర్పడిందని చెప్పవచ్చు. ఇటీవలే కాలంలో ఏఆర్ రెహమాన్ సరైన పోటీ ఇవ్వలేక పోతున్నారు. ఏఆర్ రెహమాన్ ఇంటర్నేషనల్ స్థాయిలో సౌండింగ్ ఉన్నప్పటికీ మాస్ కి మాత్రం క్రేజ్ లేదని అందుకే పెద్ది సినిమా కోసం ఏఆర్ రెహమాన్ మాస్ ఆల్బమ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లుగా టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అనిరుథ్ తన బ్యాక్ గ్రౌండ్ తో భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.