నాగబాబు కూతురు అయినటువంటి నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె చాలా కాలం క్రితం నటిగా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈమె నటించిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇక ఆ తర్వాత ఈమె వివాహం చేసుకుంది. ఈమె వివాహ బంధం కొంత కాలం మాత్రమే సజావుగా జరిగింది. ఆ తర్వాత ఈమె పెళ్లి చేసుకున్న వ్యక్తి తో విడాకులు తీసుకొని ప్రస్తుతం ఒంటరిగా ఉంటుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో నిహారిక వరస పెట్టి సినిమాలను నిర్మిస్తూ వస్తోంది.

కొంత కాలం క్రితం ఈమె కమిటీ కుర్రాళ్ళు అనే మూవీ ని నిర్మించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయం సాధించడంతో నిహారిక కు ఈ మూవీ ద్వారా నిర్మాతగా మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం నిహారిక , సంగీత్ శోభన్ హీరో గా రూపొందుతున్న సినిమాను నిర్మిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా నిహారిక ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి మహేష్ బాబు , అల్లు అర్జున్ , రామ్ చరణ్ గురించి నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా నిహారిక మాట్లాడుతూ ... మహేష్ తో సినిమా నిర్మించే అవకాశం వస్తే మైథాలజికల్ మూవీ ని నిర్మిస్తాను అని , ఒక వేళ బన్నీ తో కనుక మూవీ నిర్మించే అవకాశం వస్తే లవ్ స్టోరీ మూవీ ని నిర్మిస్తాను అని నిహారిక చెప్పుకొచ్చింది. ఇక చరణ్ తో సినిమాను నిర్మించడం కంటే కూడా సినిమాను దర్శకత్వం వహించడం ఆసక్తిగా ఉంది అని నిహారిక చెప్పుకొచ్చింది. ఇలా తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలకు సంబంధించి నిహారిక చెప్పిన ఆన్సర్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: