
ఇక దీంతో ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ అయితే ఇప్పుడు ఫిలిం వర్గాల్లో వైరల్ గా మారింది .. గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతుంది .. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తుంది .. అలాగే మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు ఎంతో త్వరగా పూర్తిచేయాలని చూస్తున్నారట .. అలాగే ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ కూడా చేసుకున్నారు మేకర్స్ .. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నా సమాచారం ప్రకారం డబ్బింగ్ పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి ఈ నెలాఖరికి టీజర్ విడుదల చేయాలని చూస్తున్నారట మేకర్స్ ..
ఇదే నిజమైతే మాత్రం ప్రభాస్ అభిమానులకి ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పాలి .. అలాగే ఈ సినిమాను సెప్టెంబర్ 24న రిలీజ్ చేస్తున్నారని టాక్ కూడా వినిపిస్తుంది . అయితే దీనిపై మాత్రం ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది .. ప్రస్తుతం ది రాజా సాబ్ మూవీ డబ్బింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తుంది .. అలాగే త్వరలోనే ప్రభాస్ సైతం ఈ మూవీ డబ్బింగ్ పనుల్లో పాల్గొంటారట .. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు .. అలాగే సలార్ 2 , కల్కి 2 సినిమాలు సైతం షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడు .