తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో బాలకృష్ణ అంటే తెలియని వారు ఉండరు. ఇప్పటికీ 6 పదుల వయస్సు దాటినా కానీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ నటిస్తున్నారు. అలాంటి ఈ హీరో  ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద వేడుకలా నిర్వహించారు. ఈ విధంగా సినిమాలో దూసుకుపోతున్న బాలకృష్ణ మరోవైపు రాజకీయాల్లో కూడా తనకు ఎదురు లేదు అనిపించుకుంటున్నారు. వరుసగా మూడోసారి హిందూపురంలో గెలుపొంది అద్భుత చరిత్ర సృష్టించారు. ఇలా రాజకీయంగా సినిమా, సేవా కార్యక్రమాల పరంగా  ఎంతో యాక్టివ్ గా ఉండే బాలకృష్ణ టాలెంటును గుర్తించిన కేంద్రం పద్మభూషణ్ అవార్డుతో సత్కారం అందించింది.

 గత కొన్ని నెలల కింద ఆమె ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది మురము చేతుల మీదుగా అందుకున్నారు. అవార్డును దేశంలోని అత్యంత ప్రముఖమైన వ్యక్తులకు మాత్రమే ఇస్తారు. వారిలో ఒకరిగా బాలకృష్ణ నిలవడం ఆయన అదృష్టమే అని చెప్పవచ్చు. అలాంటి  మంచి పొజిషన్ కు వచ్చి తాజాగా  ఒక మద్యం బ్రాండ్ కు సంబంధించిన యాడ్ లో నటించడం  సంచలనంగా మారింది. ఒక సినీ నటుడుగా ఆయన ఇలాంటి యాడ్ చేయడం తప్పు కాదు కానీ, ప్రస్తుతం ఆయనను దేశవ్యాప్తంగా గర్వించే ఒక అవార్డు వరించింది.

అంతేకాకుండా రాజకీయంగా మంచి పొజిషన్ లో ఉన్నారు. కావాల్సినంత డబ్బు, హోదా ఉంది. ఇలాంటి సమయంలో మద్యం యాడ్ ను ఎంకరేజ్ చేసి  ఆయన నటించాల్సిన అవసరం లేదు. కానీ బాలకృష్ణ తనకు ఇష్టమైన బ్రాండ్ మద్యం యాడ్ లో నటించి కాస్త నెగిటివిటీ ఎదుర్కొంటున్నాడు. అన్నీ ఉన్న ఈయన అలాంటి మద్యం బ్రాండ్ లో నటించడం ఎందుకు అంటూ బాలకృష్ణ అభిమానులే కామెంట్లు పెడుతున్నారు. దీనివల్ల సమాజం మరింత చెడు వ్యసనాలకు అలవాటుపడే అవకాశం ఉందని  ఈ మద్యం  బ్రాండ్ లో నటించి ఆయన బ్రాండ్ తగ్గించుకోవద్దని ట్విట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: