టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడి గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో శేఖర్ కమ్ముల ఒకరు . ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహిం చ గా అందులో చాలా శాతం మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే శేఖర్ కమ్ముల ప్రస్తుతం తమిళ నటుడు అయినటువంటి ధనుష్ హీరో గా కుబేర అనే సినిమాను రూపొందిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... టాలీవుడ్ సీనియర్ స్టార్ నటులలో ఒకరు అయినటువంటి నాగార్జునమూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ మూవీవ్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడంతో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ ఓ టీ టీ డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఓ ప్రముఖ ఓ టీ టీ సంస్థ ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను ఏకంగా 50 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ సినిమా విడుదల ఆయన కొన్ని వారాలు తర్వాత ఈ మూవీ ని ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేసే విధంగా ఈ మూవీ ఓ టీ టీ హక్కులను దక్కించుకున్న సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో ... ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: