టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ కొంత కాలం క్రితం సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించగా ... బీమ్స్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు.

మూవీ సూపర్ టాక్ ని తెచ్చుకొని అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో వెంకటేష్ అభిమానులు మరియు సాధారణ ప్రేక్షకులు వెంకీ నెక్స్ట్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు ... ఏ జోనర్ సినిమా చేస్తాడు అనేది తెలుసుకోవడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు. ఇకపోతే వెంకటేష్ నెక్స్ట్ మూవీపై ఇప్పటికే అనేక గాసిప్స్ బయటకు వస్తున్న ఎలాంటి అధికారిక ప్రకటనలు మాత్రం వెలబడడం లేదు. కొన్ని రోజుల క్రితం వెంకటేష్ తన నెక్స్ట్ మూవీ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నాడు అని , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతుంది అని అనేక వార్తలు బయటకు వచ్చాయి.

కానీ ఇప్పటివరకు ఈ కాంబో మూవీ కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇలా వెంకటేష్ నెక్స్ట్ మూవీ కి సంబంధించి గాసిప్స్ అనేకం వస్తున్న అప్డేట్లు మాత్రం ఏవి బయటకి రాకపోవడంతో వెంకటేష్ అభిమానులు కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి వెంకటేష్ తన తదుపరి మూవీ ని ఏ దర్శకుడితో చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: