అయితే ఈ సినిమా ఎంతవరకు ఆమెకు గుడ్ పేరు తీసుకొస్తుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ సినిమాలో డీ గ్లామరస్ లుక్ లో కనిపించబోతుంది జాన్వీ కపూర్ . దేవర సినిమాలో కూడా అలాగే డి గ్లామరస్ లుక్ లో కనిపించింది . అయితే జాన్వికపూర్ అంటే అందాల ఎక్స్పోజింగ్ పాత్రను ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు ..అభిమానులు. అమ్మడుకున్న టాలెంట్ కి ఎక్స్పోజింగ్ చేయడానికి ఏమాత్రం వెనుకాడదు. అయితే ఎందుకు తెలుగు డైరెక్టర్ లు ఆమెకి అలాంటి రోల్స్ ఇవ్వట్లేదు . అంతేకాదు ఒక్క మంచి కంటెంట్ ఉన్న సినిమా పడితే మాత్రం జాన్వీ దశ తిరిగిపోయినట్లే .
ప్రెసెంట్ సోషల్ మీడియాలో జాన్వికపూర్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం జాన్వీ కపూర్ ఓ బిగ్ బడా పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది. బన్నీ - అట్లీ కాంబోలో తెరకెక్కే సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది . నిన్న మొన్నటి వరకు జాన్వీ కపూర్ కాదు సమంత అంటూ టాక్ వినిపించింది . అయితే "శుభం" ప్రమోషన్స్ లో సమంత అట్లీ సినిమా గురించి క్లారిటీ ఇచ్చేసింది .
ఆమె హీరోయిన్ కాదు అంటూ పరోక్షకంగానే చెప్పుకొచ్చింది. అదే టైంలో జాన్వీ కపూర్ మేనేజర్ ఈ విషయాన్ని పరోక్షకంగా బయటపెట్టేసాడు అంటూ బాలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ బయటకు వచ్చింది. జాన్వి కపూర్ - అట్లీ సినిమాలో ఆల్మోస్ట్ ఆల్ హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయింది జాన్వీ అంటూ తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అప్డేట్ రాబోతుంది. అంతేకాదు ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ కి ఫుల్ ఇంపార్టెన్స్ ఉందట . బన్నీ క్యారెక్టర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో జాన్వికపూర్ క్యారెక్టర్ కి కూడా అంతే ప్రిఫరెన్స్ ఉంటుందట. అట్లీ సినిమాలు ఇప్పటి వరకు మనం గమనిస్తే ఆ విషయాన్ని బాగా గమనించొచ్చు. హీరో కన్నా కూడా హీరోయిన్ క్యారెక్టర్స్ హైలెట్ అయ్యే విధంగా రాసుకుంటారు. దీనితో సోషల్ మీడియాలో జాన్వి కపూర్ పేరు ట్రెండ్ అవుతుంది. జాన్వికపూర్ పొలంలో కూడా ఇక మొలకలు వస్తాయి అని .. ఈ సినిమా హిట్ అయితే జాన్వి కపూర్ లైఫ్ మొత్తం జిల్ జిల్ జిగా గా ముందుకు వెళ్ళిపోతుంది అని ఇండస్ట్రీలో నెక్స్ట్ నేషనల్ క్రష్ ఆమె అంటూ ధీమా చేస్తున్నారు . చూడాలి మరి అట్లీ సినిమా ఈ జాన్వీకి ఏ మాత్రం సక్సెస్ ని ఇస్తుందో..??