గత కొద్దిరోజుల నుండి కోలీవుడ్లో జయం రవి కి సంబంధించిన ఇంటి విషయాలు బయట నెట్టింట్లో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఆయన తన భార్యకు విడాకులు ఇవ్వడంతో పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. అలా మొదట విడాకులు అయ్యాక కెనీషాతో ఎఫైర్ గురించి ఆ తర్వాత రీసెంట్గా రవి కెనీషా ఇద్దరు పెళ్లిలో కనిపించడంతో పెద్ద షాక్ తగిలిన ఆర్తి సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టింది.ఈ పోస్ట్ తర్వాత కెనీషా ఆమెకు వార్నింగ్ ఇచ్చేలా పోస్ట్ చేసింది.ఆ తర్వాత జయం రవి కూడా ఆర్తి బాగోతం బయట పెడుతూ ఒక సంచలన పోస్ట్ చేశారు. అయితే ఇదంతా బాగానే ఉన్నప్పటికీ తాజాగా జయం రవి పై ఆయన అత్త అంటే ఆర్తి తల్లి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక అందులో ఏముందంటే జయం రవి వల్లే నేను సినిమాల్లోకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చాను.నేను నిర్మాణ రంగంలోకి రావడానికి కారణం జయం రవినే. 

జయం రవిని ఏ రోజు కూడా నేను అల్లుడుగా చూడలేదు.ఆయన్ని కొడుకుగానే చూశాను.. కానీ ఆయన ఇలా చేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు.ఎప్పటికీ ఆయన నా దృష్టిలో హీరో గానే ఉండాలి అనుకున్నాను.కానీ రీసెంట్ గా ఆయన చేసిన ఆరోపణల కారణంగా ఆయనపై ఉన్న మంచి అభిప్రాయం పోయింది. నేను నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాక కొన్ని సినిమాలను నిర్మించడానికి ఫైనాన్షియర్ల దగ్గర నుండి కోట్ల అప్పులు తెచ్చాను. దాదాపు 100 కోట్ల వరకు అప్పులు తెచ్చాను. ఇక ఈ కోట్ల అప్పులో 25% జయం రవికి రెమ్యూనరేషన్ రూపంలోనే ఇచ్చాను.ఆ డాక్యుమెంట్లు ఇప్పటికీ నా దగ్గరే భద్రంగా ఉన్నాయి. నేను అప్పుల్లో మునిగిపోయిన జయం రవి ఒక్క రూపాయి ఇచ్చి కూడా నన్ను ఆదుకోలేదు.

 కానీ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. తెచ్చిన అప్పులకి నష్టాలు పూడ్చడం కోసం సైరన్ అనే సినిమాను నా బ్యానర్ లోనే చేస్తానని ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు నా బ్యానర్ లో చేయడం లేదు. జయం రవి నన్ను ఎప్పుడు ప్రేమగా అమ్మ అని పిలిచేవాడు.ఎప్పటికీ అలాగే ఉండాలి అని కోరుకుంటాను.ఈ అసత్య ఆరోపణలు చేయకూడదని,ఎప్పటికీ హీరోలాగే ఉండాలని భావిస్తున్నాను. నేను బయటికి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం కూడా జయం రవి చేసిన ఆరోపణలే అంటూ జయం రవిపై ఆర్తి తల్లి సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: