తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో శ్రీ విష్ణు ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత ఈయన హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. అందులో భాగంగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో హీరో గా నటించిన శ్రీ విష్ణు ఎన్నో మూవీలతో మంచి విజయాలను కూడా సొంతం చేసుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం శ్రీ విష్ణు సామజవరగమన అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రేబా మౌనిక జాన్ హీరోయిన్గా నటించింది.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో ఏకంగా 4.91 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ విష్ణు "సింగిల్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కేతుకా శర్మ , ఇవానా హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి మంచి టాక్ రావడంతో ప్రస్తుతం ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది.

ఇకపోతే కేవలం వారం రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ నైజాం ఏరియాలో దాదాపు మూడు కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లను వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీనితో ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి సామజవరగమన లైఫ్ టైమ్ కలెక్షన్లను ఈజీగా క్రాస్ చేస్తుంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. మరి సింగిల్ మూవీ టోటల్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో ఏ స్థాయి కలెక్షన్లను వాసులు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sv