
టాలీవుడ్‌లో ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలు వరుస పెట్టి సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వం లో తెరకెక్కే ది రాజాసాబ్ సినిమా ను చాలా వరకు పూర్తి చేసేశాడు. ప్రభాస్ నుంచి రిలీజ్ అయ్యే సినిమా లలో ఇదే ముందు వరుసలో ఉంటుంది. ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా .. ఆ తర్వాత కల్కి 2 , ఆ తర్వాత సలార్ 2 ఉంటాయి. అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో స్పిరిట్ సినిమా కూడా తెరకెక్కాల్సి ఉంది. ఇలా ప్రభాస్ లైనప్ మామూలుగా లేదు. మధ్య లో ప్రభాస్ శివుడుగా చేసిన కన్నప్ప సినిమా కూడా ఉంది.
ఇదిలా ఉంటే ప్రభాస్ - దర్శకుడు హను రాఘవపూడి తో చేసే సినిమా పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఓ వైపు రాజా సాబ్ ఇంకోపక్క ఈ సినిమాని ప్రభాస్ కంప్లీట్ చేసే పనిలో ఉండగా .. హను దర్శకత్వంలో ప్రభాస్ నటించే సినిమా షూటింగ్ కూడా చకచకా సైలెంట్ గా పూర్తవుతోందట. ప్రభాస్ ఇటీవలే హైదరాబాద్ కి వచ్చి రాజాసాబ్‌కు డబ్బింగ్ చెప్పాడు. ఇక హను ప్రాజెక్ట్ లో మరో రెండు రోజుల్లోనే జాయిన్ కానున్నట్టుగా తెలుస్తుంది. ఈ షెడ్యూల్‌తో సినిమా చాలా వరకు పూర్తవుతుందని అంటున్నారు. ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు