కాలం మారుతున్న కొద్ది జనాలు లగ్జరీగా బతకడానికి అలవాటు పడిపోతున్నారు. కొన్ని సంవత్సరాల తో పోలిస్తే ఇప్పుడు లగ్జరీగా బతికే వారి సంఖ్య చాలా శాతం పెరిగిపోయింది. ఇకపోతే ప్రస్తుతం చాలా మంది ఇండ్లలో ఏసీలు ఉన్నాయి. గతంతో పోలిస్తే ఏసీలు వాడే జనాల సంఖ్య చాలా బాగా పెరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం బాగా ధనవంతుల ఇండ్లలో మాత్రమే ఏసీలు ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. మధ్య తరగతి వారు కూడా ఎంతో మంది ఏసీ లను వినియోగిస్తున్నారు.

ఇక ఏసీల వినియోగం ఎండా కాలం వచ్చింది అంటే మరీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. సంవత్సర కాలంలో వర్షా కాలం , శీతా కాలంతో పోలిస్తే వేసవి కాలంలో ఒక్క పోత భారీగా ఉండటంతో వేసవి కాలంలో ఒక్క సారిగా ఏసీల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక ఏసీలలో ఉండాలి అనుకునే జనాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో ఏసీల అమ్మకాలు కూడా భారీగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఏసీల అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం ఏకంగా 1 కోటి 40 లక్షల ఏసీలు అమ్ముడు పోయాయి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఏసీల అమ్మకాలు దాదాపు 30 శాతం వరకు పెరిగాయట.

గతంలో ఒక ఏసీ ని దాదాపుగా 15 నుండి 20 సంవత్సరాల వరకు వాడితే ఇప్పుడు  ఏడు , 8 సంవత్సరాల లోనే ఏసిని మార్చి కొత్త ఏసీ ని వాడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇలా మన దేశంలో ప్రస్తుతం ఏసీల అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే మన దేశంలో ఎండలు దారుణంగా పెరుగుతున్న సందర్భంగానే అమ్మకాలు కూడా భారీగా పెరుగుతున్నాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం భారత దేశంలో ఏసీల అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ac