
అయితే తాజాగా ఈ వార్తలలో నిజం లేదని ఈ ఫోటోలో ఉన్నది ఉపాసన, రామ్ చరణ్ కూతురు కాదన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఫోటోలు ఎత్తుకున్న అమ్మాయి నవిష్క కొణిదెలా.. ఈ పాప చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ కూతురు. 2021లో చిరంజీవి బర్త్డే సందర్భంగా ఈ ఫోటోని సైతం నవిష్క అకౌంట్ నుంచి షేర్ చేశారట. అయితే ఈ ఫోటోని చూసి ఇప్పుడు తాజాగా క్లిన్ కారా అంటూ తెగ ఫోటోని వైరల్ గా చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా శ్రీజ తన కూతురు కూడా చిరంజీవి ఇంట్లోనే ఉంటున్నారు.
ఇక రామ్ చరణ్ ,ఉపాసన తమ కూతురు ఫోటోని ఇప్పటివరకు రివిల్ చేయలేదు.. కానీ గడిచిన కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్ ఒక షోలో పాల్గొంటూ తన కూతురు ఫోటోను ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడగగా.. రామ్ చరణ్ ఎప్పుడైతే తనని నాన్న అని క్లిన్ కారా పిలుస్తుందా ఆ రోజు కచ్చితంగా తన కూతురు ఫోటోను అందరికీ పరిచయం చేస్తానని తెలియజేశారు. ఇక ఆ ఫోటోల కోసం మెగా ఫాన్స్ గత కొద్దిరోజులుగా వెయిట్ చేస్తూనే ఉన్నారు. మొత్తానికైతే చిరంజీవి ఎత్తుకున్న ఈ పాప క్లిన్ కారా కాదని తేలిపోయింది.