
ఇప్పుడు ఇప్పుడే ఆ వార్ కొంచెం కొంచెం కూల్ అవుతుంది . ఇలాంటి మూమెంట్లోనే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది గతంలో ఎప్పుడో జరిగిన వీడియో.." అల్లు అర్జున్ - సురేఖ - రామ్ చరణ్ - ఉపాసన - సాయిధరమ్ తేజ్ ఈ వీడియోలో కనిపిస్తారు . అల్లు అర్జున్ - సురేఖ - ఉపాసన ఒక సోఫాలో కూర్చుని ఉంటారు. పక్కసోఫాలో సాయిధరమ్ తేజ్ కూర్చొని ఉంటారు . సడన్గా అల్లు అర్జున్ ని గమనించిన రామ్ చరణ్ ఆయనతో మాట్లాడాలి అనుకుంటారు . వెంటనే ఉపాసనను లేపి పక్కన కూర్చోమని సురేఖ పక్కకు తప్పుకొని అల్లు అర్జున్ - రామ్ చరణ్ ను పక్కపక్కనే కూర్చోబెడుతుంది సురేఖ . దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన చాలా మంది ఇది ఇప్పుడు జరిగింది అని అనుకుంటున్నారు . అల్లు అర్జున్ చరణ్ కలిసిపోయారా..? అంటూ మాట్లాడుకుంటున్నారు".
అల్లు అర్జున్ - చరణ్ కలిసిపోతే బాగుండు అని.. మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అన్ని ఫంక్షన్స్ కి అటెండ్ అయితే బాగుంటుంది అంటూ మాట్లాడుకుంటున్నారు . కానీ ఇది ఇప్పటి వీడియో కాదు ఎప్పటి వీడియోనో. అంతేకాదు హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది . ఈ సినిమాకి స్పెషల్ గెస్ట్లుగా చిరంజీవి - రామ్ చరణ్ తో పాటు అల్లు అర్జున్ ని కూడా పిలవాలి అంటూ ఫిక్స్ అయ్యారట మూవీ టీం. కానీ అల్లు అర్జున్ ని పిలవడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడా లేదా అన్నది క్వశ్చన్ మార్క్..?
జనసేన పార్టీకి సపోర్ట్ చేయకుండా వేరే పార్టీకి సపోర్ట్ చేసిన కారణంగానే అల్లు అర్జున్ ని మెగా ఫ్యామిలీ వదిలేసింది అని అంతా మాట్లాడుకుంటున్నారు . అది రాంగ్ అని ప్రూవ్ చేయాలి అంటే పవన్ కళ్యాణ్ అందుకు ఒప్పుకొని తీరాల్సిందే . హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బన్నీని పిలవాల్సిందే . ఒకవేళ అదే జరిగితే మాత్రం ఏ గొడవ లేదు అల్లు మెగా ఫ్యామిలీ కలిసిపోయింది అన్న వార్తలు మనం వినచ్చు. పవన్ కళ్యాణ్ కూడా ఫ్యామిలీ అంటే కలిసి ఉండడానికే ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటారు. పవన్ ఏం చేస్తాడో ఈ విషయంలో అని ఫ్యాస్న్ కూడా వెయిటింగ్..!?