గత నాలుగైదు రోజుల నుండి విశాల్ పెళ్లి వార్తలు కోలీవుడ్ మీడియాతో పాటు సౌత్ ఇండస్ట్రీలో ఎంత వైరల్ గా మారుతున్నాయో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా 50 ఏళ్ల వయసుకు దగ్గర పడుతున్న విశాల్ ఎవరిని పెళ్లి చేసుకుంటారో తెలుసుకోవాలని చాలామందిలో ఒక ఆసక్తి ఉండేది.అంతే కాదు ఓ ఇంటర్వ్యూలో స్వయంగా నేను ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను, మాది లవ్ మ్యారేజ్.. గత కొద్ది రోజుల నుండి ప్రేమలో ఉన్నాను నటీనటుల సంఘం అయినటువంటి నడిగర్ సంఘ భవనం ప్రారంభోత్సవాన్ని ఆగస్టు 15న చేసి ఆ తర్వాత నా బర్త్ డే ఆగస్టు 29న నా పెళ్లికి సంబంధించిన ప్రకటన అధికారికంగా చేస్తాను అంటూ విశాల్ చెప్పారు. ఇక విశాల్ తన పెళ్లి న్యూస్ చెప్పడంతో విశాల్ అభమానుల ఆనందానికి అవధులు లేవు. 

ముఖ్యంగా విశాల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బంధువుల అమ్మాయా లేక ఇండస్ట్రీకి చెందిన హీరోయినా అని చాలామందిలో ఒక అనుమానం ఉంది. అయితే తాజాగా విశాల్ పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి ఎవరో బయటికి వచ్చేసింది. ఇక ఆమె చుట్టాల అమ్మాయి కాదు కబాలి మూవీలో నటించిన ధన్సిక అంటే అందరికీ తెలిసే ఉంటుంది. హీరోయిన్ ధన్సిక, విశాల్ గత కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్నారట. ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని అందుకే విశాల్ త్వరలోనే పెళ్లి చేసుకుంటానని ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా తన పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది ధన్సిక. యోగి డా అనే ఆడియో లాంచ్ లో విశాల్, ధన్సిక ఇద్దరు పాల్గొన్నారు.

అయితే ఈ ఈవెంట్లో తమిళ హీరోతో ధన్సిక పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది ఈ హీరోయిన్.. ఈ ఆడియో లాంచ్ ఈవెంట్లో ధన్సిక మాట్లాడుతూ అవును నిజమే నేను విశాల్ ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాను. మా పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాం.ఆగస్టు 29నే మా పెళ్లి జరగబోతుంది అంటూ ప్రకటించింది.ఇక ఈమె ఈ మాటలు చెప్పిన సమయంలో విశాల్ కూడా అక్కడే ఉండడంతో వీరిద్దరి వివాహం ఆగస్టు 29 న విశాల్ బర్త్డే రోజు జరగబోతుందని అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. ఏది ఏమైనప్పటికీ ఇన్ని రోజులకు విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: