తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , మంచు మనోజ్ , నారా రోహిత్ హీరోలుగా విజయ్ కనకమెడల దర్శకత్వంలో భైరవం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ ని మే 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేసింది.

మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆధ్యాంతం ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. అలాగే ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా యొక్క సాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ అమ్మివేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా యొక్క శాటిలైట్ మరియు ఓ టీ టీ హక్కులను జీ సంస్థ వారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ సినిమా విడుదల అయ్యి కొన్ని వారాలు పూర్తి అయిన తర్వాత ఈ మూవీ ని జీ 4 ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు , కొన్ని తర్వాత ఈ సినిమాను జీ టీవీలో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్నాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి , ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: