యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటుడిగా కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది . ఇప్పటివరకు తారక్ అనేక సినిమాలలో హీరోగా నటిం చి ఎ న్నో విజయాల ను అందుకుని తెలుగు సినీ పరిశ్రమలో స్టా ర్ హీరో లలో ఒక రిగా కెరీర్ను కొనసాగిస్తున్నాడు . తారక్ తన నటించిన సినిమాలతో ఎన్నో విజయాలను అందుకొ ని ఇండియా వ్యాప్తం గా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తారక్ ఓ వైపు వార్ 2 అనే హిందీ సినిమాలో నటిస్తూ నే మరో వైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఓ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ రెండు సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఓ విషయంలో తారక్ ను కొట్టడం ఈతరం స్టార్ హీరోలకు చాలా కష్టంగా కనబడుతుంది. అది ఏ విషయంలో అనుకుంటున్నారా ..? వరుస పెట్టి అనేక సంవత్సరాలు విజయాలను అందుకోవడంలో. తారక్ ఆఖరి అపజయాన్ని అందుకొని ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతుంది. తారక్ ఆఖరి అపజయాన్ని 2014 సంవత్సరంలో విడుదల అయిన రభస మూవీ తో అందుకున్నాడు.

మూవీ తర్వాత తారక్ హీరో గా రూపొందిన టెంపర్ , నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్ , జై లవకుశ , అరవింద సమేత వీర రాఘవ , ఆర్ ఆర్ ఆర్ దేవర పార్ట్ 1 సినిమాపై బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. దీనితో ఇప్పటికే తారక్ ఆఖరి అపజయాన్ని అందుకొని పది సంవత్సరాలు దాటిపోయింది. దానితో అనేక మంది ఇన్ని సంవత్సరాల పాటు వరుస విజయాలను కంటిన్యూ చేయడం ఈ తరం స్టార్ హీరోలలో ఇతరులకు సాధ్యం కావడం కాస్త కష్టం అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: