జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించక ముందు కూడా చాలా క్లోజ్ గా ఉండేవారు. అలా ఆర్ఆర్ఆర్ సినిమా లో ఎప్పుడైతే నటించారో అప్పటి నుండి వీరిద్దరూ ఫ్యామిలీ తో సహా కలిసి బయట వెకేషన్ లకి వెళ్తున్నారు. అలా తాజాగా మేడమ్ టుస్సడ్స్ లో రాం చరణ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సమయం లో కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీ అక్కడ సందడి చేసింది. ఇందులో భాగంగా రామ్ చరణ్ ఎన్టీఆర్ తమ కుటుంబం తో సహా రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరిగిన ఆర్ఆర్ఆర్ కన్సర్ట్ ఈవెంట్ కి హాజరయ్యారు. ఇందులో భాగంగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 
 
ఇప్పుడు ఉపాసన మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఉపాసనఈవెంట్ లో మాట్లాడుతూ.. లక్ష్మీ ప్రణతి నాకంటే వయసు లో చాలా చిన్నది. అయినా కూడా అన్ని విషయాలను మ్యానేజ్ చేయగల సత్తా ఆమె లో ఉంది. ఇలాంటి ఒక మంచి భార్య ను పొందినందుకు ఎన్టీఆర్ ఎంతో అదృష్టవంతుడు.. లక్ష్మి ప్రణతి స్ట్రాంగ్ గా ఉండడమే కాదు చాలా స్వీట్ పర్సన్ కూడా అంటూ లక్ష్మీ ప్రణతి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఉపాసన.

ప్రస్తుతం ఉపాసన మాట్లాడిన మాటలు  వైరల్ గా మారడంతో  రామ్ చరణ్ భార్య ఉపాసన కి లక్ష్మీ ప్రణతి పై ఇంత ప్రేమ ఉందా.. లోపల ఇంత దాచుకుందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ని తక్కువ చేసి చూపించారు అంటూ నందమూరి ఫ్యాన్స్ ఆరోపించారు. ఇందులో భాగంగా నందమూరి మెగా ఫ్యామిలీ అభిమానుల మధ్య సోషల్ మీడియా లో వార్ నడిచిన సంగతి మనకు తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: