ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే నందమూరి ఫ్యాన్స్ కి ఒక పండుగ లాంటి రోజు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నెక్స్ట్ మూవీస్ కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ప్లాన్ చేస్తారో మేకర్స్ అందరికీ తెలిసిందే. అయితే ఈసారి బర్త్డ డే విషయంలో ఎన్టీఆర్ కూసింత ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశాడనే చెప్పాలి . మరీ ముఖ్యంగా ఎప్పటినుంచి ఆశపడుతున్న ఎన్టీఆర్ 31 సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ రాకపోవడం ఒక మైనస్ అయితే వచ్చిన వార్ 2 సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా నందమూరి ఫ్యాన్స్ కి పెద్దగా కిక్ ఇవ్వలేకపోయింది .


మనకు తెలిసిందే కొద్దిసేపటి క్రితమే వార్ 2 సినిమా నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ అయ్యింది.  ఈ వీడియోలో ఎన్టీఆర్ పర్ఫామెన్స్ వేరే లెవెల్ లో ఉండింది.  అయితే సాధారణంగా ఏ స్టార్ హీరో పుట్టిన రోజు అయిన సరే ఆయనకు సంబంధించిన వీడియో ని హైలెట్ చేస్తూ ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్ ను రిలీజ్ చేస్తారు మేకర్స్ . అయితే వార్ 2 అనేది బాలీవుడ్ మూవీ మొత్తం బాలీవుడ్ నటీనటులే ఎన్టీఆర్ ఒక్కరే తెలుగు నటుడు . పైగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం. ఆయన బాలీవుడ్ డైరెక్టర్ నే గా. ఆ కారణంగానే ఎన్టీఆర్ పై పెద్దగా కాన్సన్ట్రేషన్ చేసినట్లు లేడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

 

వార్ 2 సినిమాకి సంబంధించిన అప్డేట్ అయితే రిలీజ్ అయ్యింది.  అయితే ఇది మాత్రం నందమూరి అభిమానులు ఆశించినంత స్థాయిలో లేదు . ఎన్టీఆర్ లుక్స్ బాగానే ఉన్నాయి . ఎన్టీఆర్ పర్ఫామెన్స్ వేరే లెవెల్ కానీ ఈ వీడియోలో ఎన్టీఆర్ కన్నా కూడా హీరో హృతిక్ రోషన్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినట్లు ఉన్నాడు డైరెక్టర్ అంటూ తెలుగు జనాలు మాట్లాడుతున్నారు. అదే మన తెలుగు సినిమాకి సంబంధించిన అప్డేట్ అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయి ఉంటే వేరే లెవెల్ లో ఉండేది అని ఇది నిజంగా బాలీవుడ్ కావాలనే చేసిన ఒక పని అంటూ కొంతమంది నందమూరి ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.  అంతేకాదు బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎప్పుడు తెలుగు హీరోలంటే చులకన.. చిన్న చూపే .. మరొకసారి అదే ప్రూవ్ చేసింది ఈ వీడియోతో అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. కొంతమంది మాత్రమే ఎన్టీఆర్ వార్ 2  సినిమా వీడియో బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి ఎన్టీఆర్ పుట్టినరోజు కారణంగా రిలీజ్ అయిన వార్ 2 వీడియో సోషల్ మీడియాలో అభిమానులకి పెద్ద తలనొప్పి క్రియేట్ అయ్యేలా చేసింది..!



మరింత సమాచారం తెలుసుకోండి: