టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీ సినిమా అయినటువంటి వార్ 2 లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. వార్ 2 మూవీ లో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం వార్ అనే సినిమా వచ్చి బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో వార్ 2 మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తారక్ కూడా నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతున్న ఈ మూవీ కి సంబంధించిన ఏ అప్డేట్లను కూడా మేకర్స్ పెద్దగా విడుదల చేయలేదు. ఇక ఈ రోజు అనగా మే 20 వ తేదీన తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది. ఈ మూవీ టీజర్ ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ టీజర్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

ఇకపోతే ఇన్ని రోజుల పాటు ఈ మూవీ లో తారక్ హీరో గా నటిస్తున్నాడా ..? లేక విలన్ పాత్రలో నటిస్తున్నాడా ..? అనే కన్ఫ్యూజన్ చాలా మంది జనాల్లో ఉంది. ఈ రోజు విడుదల అయిన వార్ 2 టీజర్ను బట్టి చూస్తే ఈ మూవీలో తారక్ హీరో పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న సినిమాలో కూడా తారక్ హీరో పాత్రలో కనిపించే అవకాశాలు ఉండడంతో ఇది తెలుగు హీరో క్రేజ్ అని చాలా మంది తెలుగు ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: