కొన్ని సంవత్సరాల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రియమణి హీరోయిన్ గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యమదొంగ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. మోహన్ బాబు ఈ మూవీ యముడి పాత్రలో నటించగా ... బ్రహ్మానందం ఈ మూవీ లో చిత్ర గుప్తుడి పాత్రలో నటించాడు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించగా ... విజయేంద్ర ప్రసాద్మూవీ కి కథను అందించాడు. భారీ అంచనాల నడుమ 2017 వ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇకపోతే ఈ సినిమాను తాజాగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు రీ రిలీజ్ లో బాగంగా ఈ సినిమాకు సంబంధించిన రెండు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల వివరాలు తెలుసుకుందాం.

రెండు రోజుల్లో ఈ సినిమాకు రీ రిలీజ్ లో భాగంగా నైజాం ఏరియాలో 58 లక్షల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 25 లక్షలు , ఆంధ్ర లో 70 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండు రోజుల్లో 1.53 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక రెండు రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 30 లక్షల కలెక్షన్లు వచ్చాయి. ఇకపోతే రెండు రోజుల్లో కలిపి ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 1.83 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇలా ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా రెండు రోజుల్లో పర్వాలేదు అనే స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: