టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరో ల తో సరి సమాన గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో అనుష్క ఒకరు . ఈమె టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో గా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రూపొంది న సూపర్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అ యిం ది . ఈ మూవీ పెద్ద స్థాయి విజయం సాధించక పోbయి నా ఇందులో అనుష్క తన అందాల తో , నటన తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం తో ఈ మూవీ ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది . ఆ తర్వాత ఈమె కు వరుస పెట్టి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమా లలో అవకాశాలు వచ్చాయి.

ఇది ఇలా ఉంటే ఈమెకు ప్రస్తుతం అద్భుతమైన ఉన్న కూడా ఈమె వరుస పెట్టి సినిమాలలో నటించకుండా ఆచితూచే సినిమాలలో నటిస్తూ వస్తుంది. అనుష్క ఆఖరిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం అనుష్క , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఘాటి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తుంది. గతంలో అనుష్క , క్రిష్ కాంబోలో రూపొందిన వేదం సినిమా మంచి విజయం సాధించి ఉండడంతో ఘాటి మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఘాటి మూవీ ని జూలై మొదటి వారం లేదా రెండవ వారంలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు మరికొన్ని రోజుల్లో ఒక తేదీని ఫిక్స్ చేసి దానిని అధికారికంగా ప్రకటించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఘాటి మూవీ తో అనుష్క ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: