రీసెంట్ గా రిలీజ్ కి వచ్చిన పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవేటేడ్ మల్టీ స్టార‌ర్ టీజర్ ఏదైనా ఉంది అంటే అది బిగ్గెస్ట్ మూవీ వార్ 2 టీజర్ అనే చెప్పాలి .  ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ కలయికలో బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఇప్పుడు తెలుగు  సహా హిందీ భాషల్లో కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకుంటుంది .. అయితే ఇప్పుడు ఈ టీజ‌ర్ లో అంతా హృతిక్ , తారక్ లు హైలైట్ అవుతారు అంత వారి కోసమే మాట్లాడుకుంటారు అనుకుంటే .. ఎవరు ఊహించ ని విధంగా అవుట్ ఆఫ్ సిలబస్ లా హీరోయిన్ కియారా అద్వానీ బయటకు వచ్చింది .. ప్రధానం గా ఆమె పై చూపించిన కొన్ని షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ దుమ్ము రేపుతున్నాయి ..


అలాగే ఆమె నుంచి తొలి సారిగా బికినీ వేయటం పైగా ఆమెని ప్రెసెంట్ చేసిన విజువల్స్ కూడా ప్రేక్షకుల్ని ఎంత గానో ఆకట్టుకుంటున్నాయి .. ఇలా వార్ 2 లో  ఆమెని ప్రెజెంట్ చేసిన విజువల్స్ కూడా ఆడియెన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఇలా వార్ 2 టీజర్ నుంచి కియారా ఒక ఊహించని హైలెట్ గా నిలుస్తుంది అని ఎవరు ఊహించలేదు .. ఆమె స్క్రీన్ ప్రజెంట్ కూడా ఈ స్టైల్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందని కూడా ఎవరూ భావించలేదు .. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియా లో కియారా క్రేజ్ తో భారీ స్థాయి లో దూసుకుపోతుంది .. ఇక మరి సినిమా లో కియారా ఏ స్థాయి లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9705876414 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: