టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ హిందీ నటుడు హృతిక్ రోషన్ కలిసి వార్ 2 అనే సినిమాలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి కియరా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే నిన్న అనగా మే 20 వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో వార్ 2 కి సంబంధించిన టీజర్ను ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ టీజర్ బాగుంది అని ప్రేక్షకుల నుండి ఫీడ్ బ్యాక్ వస్తున్న ఈ మూవీ టీజర్ భారీ స్థాయి వ్యూస్ ను దక్కించుకోవడంలో చాలా వెనకబడిపోయింది. ఈ మూవీ యొక్క తెలుగు మరియు హిందీ వర్షన్ టీజర్లకు విడుదల అయిన 24 గంటల్లో వచ్చిన వ్యూస్ , లైక్స్ వివరాలను తెలుసుకుందాం.

సినిమా యొక్క తెలుగు వర్షన్ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 3.15 మిలియన్ వ్యూస్ ... 218.1 కే లైక్స్ లభించాయి ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ తెలుగు వర్షన్ టీజర్ కు ప్రేక్షకుల నుండి పెద్ద స్థాయిలో రెస్పాన్స్ లభించలేదు అని చెప్పవచ్చు.

మూవీ హిందీ వర్షన్ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 20.35 మిలియన్ వ్యూస్ ... 679.4 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ మూవీ హిందీ వర్షన్ టీజర్ కు మాత్రం ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

మూవీ తెలుగు వర్షన్ టీజర్ కు పెద్ద స్థాయిలో రెస్పాన్స్ రాకపోయినా జూనియర్ ఎన్టీఆర్ హీరో గా నటిస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానితో ఈ మూవీ యొక్క తెలుగు హక్కుల కూడా భారీ క్రేజ్ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: