టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి చాలా సంవత్సరాల క్రితం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో చిరంజీవి కి జోడిగా శ్రీదేవి నటించగా ... అశ్వినీ దత్ ఈ సినిమాను నిర్మించాడు. ఇళయరాజామూవీ కి సంగీతం అందించగా ... అమ్రేష్ పురి ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ మూవీ ని ఈ సంవత్సరం మే 9 తేదీన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు. ఇకపోతే రీ రిలీజ్ లో భాగంగా కూడా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లు వచ్చాయి. రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.

రీ రిలీజ్ లో భాగంగా ఈ మూవీ కి నైజాం ఏరియాలో ఒక కోటి కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 30 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 1.08 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 2.38 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 58 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు రీ రిలీజ్ లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 2.96 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. కొన్ని రోజుల క్రితం చిరంజీవి హీరో గా రూపొందిన ఇంద్ర మూవీ రీ రిలీజ్ అయ్యి అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఇక తాజాగా విడుదల అయిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కూడా మంచి కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: