పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నీది అగర్వాల్ హీరోయిన్గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏ ఎం రత్నం నిర్మాతగా చాలా కాలం క్రితం హరిహర వీరమల్లు అనే సినిమా స్టార్ట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ స్టార్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సినిమాను పక్కన పెట్టి భీమ్లా నాయక్ , బ్రో సినిమాల షూటింగ్లను పూర్తి చేశాడు. ఈ మూవీ లు కూడా ఇప్పటికే విడుదల అయ్యాయి. ఇక పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఓజి , ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ మూవీలో షూటింగ్లను కూడా స్టార్ట్ చేశాడు.

ఇటు చూస్తే క్రిష్ జాగర్లమూడి కూడా ఈ సినిమాను పక్కన పెట్టి కొండపోలం అనే సినిమాని పూర్తి చేసి దానిని విడుదల చేశాడు. ఇక ఆ తర్వాత క్రిష్ ఈ సినిమా దర్శకత్వ భాద్యతల నుండి తప్పుకొని అనుష్క ప్రధాన పాత్రలో ఘాటి అనే సినిమాను స్టార్ట్ చేశాడు. ఇలా ఈ సినిమా చాలా కాలం క్రితం స్టార్ట్ అయ్యి చాలా సార్లు ఆగిపోతూ రావడంతో ఈ మూవీ మొత్తం పూర్తి అయ్యి విడుదల అవుతుందా లేదా అని అనుమానాలు జనాల్లో వచ్చాయి. కానీ క్రిష్ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు నుండి తప్పుకున్నాక ఈ మూవీ దర్శకత్వ బాధ్యతలను జ్యోతి కృష్ణ అనే దర్శకుడు తీసుకొని ఈ మూవీ షూటింగ్ను విజయవంతంగా పూర్తి చేశాడు. ఈ మూవీ ని జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ నిర్మాత అయినటువంటి ఏ ఎం రత్నం మాట్లాడుతూ ... మా బ్యానర్ లో పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఖుషి , బంగారం అనే రెండు సినిమాలు చేశాడు.

పవన్ కళ్యాణ్ తో మూడో సినిమా కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాం. కొంత కాలం క్రితం సత్యాగ్రహి అనే సినిమాను చేయాలి అనుకున్నాం. కానీ అది కుదరలేదు. ఆ తర్వాత వేదాలం అనే తమిళ మూవీ ని పవన్ హీరోగా రీమిక్ చేయాలి అనుకున్నాం అది కూడా కుదరలేదు. చివరగా పవన్ తో హరిహర వీరమల్లు సినిమాను చేశాం అని ఏ ఎం రత్నం చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: