టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో అక్కినేని నాగ చైతన్య ఒకరు. ఈయన జోష్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. కానీ ఈ మూవీ చైతన్య కు మంచి విజయాన్ని అందించలేదు. ఆ తర్వాత ఈయన గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఏం మాయ చేసావే అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. సమంత ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా నాగ చైతన్య కు మొదటి విజయం దక్కింది. అలాగే నటుడిగా మంచి గుర్తింపు కూడా లభించింది. ఈ సినిమా 2010 వ సంవత్సరం ఫిబ్రవరి 26 వ తేదీన విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే రీ రిలీజ్ చేయాలి అనే ఆలోచనకు మేకర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క రీ రిలీజ్ తేదీని కూడా మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న అందులో ఎక్కువ శాతం లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీలకు రీ రిలీజ్ లో భాగంగా మంచి కలెక్షన్లు వస్తున్నాయి.

దానితో ఈ సినిమా కూడా లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ జోనర్ కి సంబంధించిన మూవీ కావడంతో ఈ మూవీ కి కూడా రీ రిలీజ్ లో భాగంగా భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో నాగ చైతన్య , సమంత జోడి కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc