
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను చూసిన ప్రతిసారి తల్లి శ్రీదేవి అందరికీ ఒక్కసారిగా గుర్తుకు వస్తూ ఉంటుంది. అయితే ఆమె అలా కనిపించడానికి అసలు ప్రయత్నించదు . ఆ పోలికలు అలా ఆమెకు పుట్టుకతోనే వచ్చాయి . అయితే మొదటిసారి తన తల్లి శ్రీదేవిలా కనిపించడానికి జాన్వీ ఎంతగానో ప్రయత్నించింది .. అది కూడా అంతర్జాతీయ వేదికపై .. తన కెరీర్లో తొలిసారి కాన్స్ చిత్రోత్సవంలో మెరిసింది జాన్వీ కపూర్ .. ఇక ఈ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్టుకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే .. అయితే ఇలాంటి ఫేమస్ రెడ్ కార్పొరేట్ పై తల్లి ని గుర్తు చేయాలనుకుంది జాన్వీ ..
అయితే దానికోసం ఆమె లేత గులాబీ రంగు దుస్తుల తో పాటు భారతీయ సంప్రదాయ శైలి దుస్తులను ధరించి అందరినీ మైమరిపింప చేసింది .. డిజైనర్ తరుణ్ తహిలయణి ఈ దుస్తులు డిజైన్ చేశారు .. అలాగే భారతీయుల తో పాటు శ్రీదేవిని గుర్తుచేయాలని టార్గెట్ తో ఈ దుస్తులను డిజైన్ చేసినట్టు చూడగానే అందరికీ తెలిసిపోతుంది . జాన్వీ తన మెంటర్ కరణ్ జోహార్ తో కలిసి కాన్స్ ఫీలింగ్ ఫెస్టివల్ కు హాజరైంది . అలాగే రెడ్ కార్పెట్ పై డ్రెస్ లో అందంగా మెరిసి అందరినీ ఆశ్చర్యపరిచింది . అలాగే మన భారతీయ ప్రేక్షకులకు తన తల్లి శ్రీదేవి ని మరోసారి ఈమె గుర్తు చేసింది .. ఇక ప్రస్తుతం జాన్వీ సౌత్ సినిమాల పై ఎక్కువ దృష్టి పెట్టింది .. తెలుగు లో రామ్ చరణ్ హీరో గా పెద్ది అనే సినిమా చేస్తుంది .. అలాగే త్వరలోనే ఆమె తిరిగి సినిమా షూటింగ్లో కూడా అడుగు పెట్టబోతుంది .