కోలీవుడ్ నటుడు విశాల్ 47 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయ్యారు. ఇన్ని రోజులుగా ఎన్నో పెళ్లి వార్తలు వినిపించినప్పటికీ ఏది కూడా నిజం కాలేదు. ముఖ్యంగా అనీషారెడ్డి తో పెళ్లి వరకు వెళ్లి క్యాన్సిల్ అయింది. ఇక మరికొంతమంది హీరోయిన్లతో కూడా ఈయన డేటింగ్ చేశారని వార్తలు వినిపించాయి.అయితే ఆ వార్తలు రూమర్లా లేక నిజాలా అనేది తెలియదు. కానీ కీర్తి సురేష్ ని మాత్రం విశాల్ పెళ్లి చేసుకోవాలి అనుకున్నారని ఓ డైరెక్టర్ స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ కీర్తి సురేష్ కి ముందే బాయ్ ఫ్రెండ్ ఉండడంతో విశాల్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదట. అయితే తాజాగా విశాల్ హీరోయిన్ సాయి ధన్షికను పెళ్లి చేసుకోబోతున్న వేళ విశాల్ కి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో భాగంగా విశాల్ బ్యాగ్రౌండ్ ఏంటి.. ఆయన తండ్రి ఏం పని చేస్తారు.. ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నాయి అనే వార్త కోలీవుడ్లో వైరల్ గా మారింది. మరి ఇంతకీ విశాల్ తండ్రి చేసే పని ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. 

హీరో విశాల్ తండ్రి పేరు జీకే రెడ్డి.. ఈయన ప్రముఖ గ్రానైట్ బిజినెస్ మాన్ అని తెలుస్తోంది.అలాగే గ్రానైట్ బిజినెస్ తో జీకే రెడ్డి కోట్లకు కోట్లు సంపాదించారట. అలాగే విశాల్ కి ఓ బ్రదర్ కూడా ఉన్నారు. ఆయన కూడా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా యాక్టర్ గా రాణిస్తున్నారు. ఇక జీకే రెడ్డి గ్రానైట్ బిజినెస్ మాన్ గానే కాకుండా సినిమాల్లోకి వచ్చి పలు సినిమాలకు ప్రొడ్యూసర్ గా కూడా చేశారు.అలా విశాల్ మొదట యాక్షన్ హీరో అర్జున్ సార్జా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత చెల్లమే అంటే తెలుగులో విడుదలైన చదరంగం సినిమాతో సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇక మొదటి సినిమానే హిట్టు కొట్టడంతో విశాల్ కి ఆ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చాయి.

అలా విశాల్ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి కోట్ల ఆస్తులు సంపాదించారు. తండ్రి సంపాదించినవి కాకుండా ఈయన స్వయంగా తన సినిమాలతో 150 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించినట్టు తెలుస్తోంది. అలాగే విశాల్ కి లగ్జరీ కార్లు, ఫ్లాట్లు, బంగ్లాలు కూడా ఉన్నాయట. ఇక విశాల్ తండ్రి జీకే రెడ్డికి కూడా చాలానే ఆస్తిపాస్తులు ఉన్నాయట. కానీ విశాల్ తండ్రి గురించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే విశాల్ తండ్రి జీకే రెడ్డికి వేలకోట్ల ఆస్తులు ఉన్నాయని, ఆ ఆస్తులు అన్ని కలిపి ఏపీని సగం కొనేయొచ్చు అంటూ రూమర్లు క్రియేట్ చేస్తున్నారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు.ఇక విశాల్ కోలీవుడ్ నటుడు అయినప్పటికీ ఆయన ఏపీలోని నెల్లూరుకి చెందిన వాడే.

మరింత సమాచారం తెలుసుకోండి: