
కానీ దాని గురించి పట్టించుకునే వాళ్ళకంటే చర్చించుకునే వాళ్లే ఎక్కువ . కాగా రీసెంట్ గా హీరోయిన్ జాన్వీ కపూర్ ని తమ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ అప్రోచ్ అయ్యారట తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఒక యంగ్ డైరెక్టర్ మూవీ టీం . వీళ్లు చేసింది రెండే రెండు సినిమాలే హిట్ కూడా కొట్టలేదు . కానీ మంచి కాన్సెప్ట్ తో మూవీని తెరకెక్కించారు ఈ డైరెక్టర్ . కాగా ఇప్పుడు మరొక యంగ్ హీరోతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు . ఈ సినిమాలో జాన్వి కపూర్ ని హీరోయిన్గా పెట్టుకుంటే తన సినిమాకి పబ్లిసిటీ పాపులారిటీ రెండు కలిసి వస్తాయి అని అనుకోని .. జాన్వి కపూర్ లో టాలెంట్ ఉంది కాన్సెప్ట్ సినిమాలని ఓకే చేస్తుంది అంటూ ఆమెని ఒప్పించడానికి బాగా ట్రై చేశారట .
మనకు తెలిసిందే జాన్వికపూర్ కన్నా ముందు ఆ స్టోరీని బోనీ కపూర్ వింటాడు. అయితే ఈ స్టోరీ వినడానికి కూడా బోనికపూర్ సిద్ధంగా లేడట . ఒకే ఒక్క మాటతో కొట్టి పడేసారట . ఇంతకుముందు ఎన్ని సినిమాలు తెరకెక్కించావ్..ఎన్ని హిట్స్ కొట్టా వ్..ఎంత కలెక్షన్స్ సాధించావు అంటూ ఆ డైరెక్టర్ ను కెరీర్ పరంగా నెగిటివ్గా మాట్లాడారట . అంతేకాదు ఆ డైరెక్టర్ మాట్లాడిన పద్ధతి బోనీ కపూర్ కి నచ్చకపోవడంతో కూసింత ఘాటుగా రియాక్ట్ అయ్యాడట . అంతేకాదు సినిమాని సున్నితంగా రిజెక్ట్ చేశారట .
కానీ ఆ తెలుగు యంగ్ డైరెక్టర్ మాత్రం జాన్వి కపూర్ తో మాట్లాడినవ్వకుండానే బోనీకపూర్ ఈ సినిమాను క్యాన్సిల్ చేయడంతో డీప్ గా హర్ట్ అయ్యి నెగిటివ్ ప్రచారం చేశారట . బోనీకపూర్ పై చాడీలు చెప్పడం ప్రారంభించారట. అంతే ఈ విషయాన్ని తెలుసుకున్న బోనీ కపూర్ డైరెక్ట్ గా ఆ యంగ్ డైరెక్టర్ కి కాల్ చేసి మరి "ఇండస్ట్రీ అంటే కొన్ని నీతి నియమాలు ఉంటాయి.. వాటిని తప్పితే ఎవరైనా సరే ఇండస్ట్రీ నుంచి తరిమి తరిమి కొడతారు.. గుర్తుపెట్టుకోవాలి.. ఇండస్ట్రీ అంటేనే నిజాయితీగా ఉండాలి "అంటూ ఆ తెలుగు యంగ్ డైరెక్టర్ కు కూసింత ఘాటుగా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారట . తెలుగు మీడియాలో బాలీవుడ్ ఇండస్ట్రిలో ఎప్పుడు ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!