తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి తారక్ ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో హీరో గా నటించి ఎంతో మంది నటీమణులతో ఆడి పాడిన విషయం మనకు తెలిసిందే. ఎంతో మంది నటీమణులతో కలిసి తారక్ స్క్రీన్ షేర్ చేసుకున్న ఒక నటి మాత్రం ఈయనకు అద్భుతంగా కలిసి వచ్చింది. ఏకంగా తారక్ నటించిన నాలుగు సినిమాల్లో ఆ బ్యూటీ నటించింది. ఆ నాలుగు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.

ఇంతకు తారక్ కి అంతలా కలిసి వచ్చిన ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆ నటీమణి మరెవరో కాదు ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి అయినటువంటి కాజల్ అగర్వాల్. తారక్ , కాజల్ కాంబోలో మొదటగా బృందావనం అనే సినిమా వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత వీరిద్దరి కాంబోలో బాద్ షా అనే సినిమా వచ్చింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన జనతా గ్యారేజ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఐటమ్ సాంగ్ చేసింది. ఈ మూవీ లో కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ కి అద్భుతమైన గుర్తింపు వచ్చింది. అలాగే ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే తారక్ , కాజల్ కాంబోలో ఆఖరుగా టెంపర్ అనే మూవీ వచ్చింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ఇప్పటివరకు తారక్ , కాజల్ కాంబోలో మొత్తం నాలుగు సినిమాలు రాగా ఆ నాలుగు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: