కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబినేషన్ లో రూపొందిన తాజా చిత్రం `కుబేర`. శేఖర్‌ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ల‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. జిమ్ సర్బ్, రష్మిక మందన్న, దలీప్ తహిల్ త‌దితరులు ఇత‌ర ముఖ్యపాత్రల‌ను పోషించారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మితమైన కుబేర చిత్రం జూన్ 20న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.


ఇటీవల బ‌ట‌య‌కు వ‌చ్చిన కుబేర టీజర్ కు విశేషమైన స్పందన వచ్చింది. సినిమాపై అంచనాలను తారాస్థాయిలో పెంచింది. అయితే రిలీజ్ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ కూడా షురూ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే రీసెంట్ గా ఓ తమిళ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్‌.. నాగార్జున పై తనకున్న అభిమానాన్ని బయటపెట్టారు.


కుబేర‌లో నాగార్జున గారితో కలిసి యాక్ట్‌ చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని.. షూటింగ్ టైమ్‌లో ఆయన నుంచి నేర్చుకున్న పాఠాలు నా లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతాయ‌ని ధ‌నుష్ పేర్కొన్నారు. అలాగే చిన్నతనం నుంచి నాగార్జున గారి సినిమాల‌కు తాను అభిమానిన‌ని.. ఆయన నటించిన చిత్రాల్లో `రక్షకుడు` మూవీ అంటే తనకెంతో ఇష్టమని ధనుష్ తెలిపాడు. ప్ర‌స్తుతం ధ‌నుష్ కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.


కాగా, ప్రవీణ్ గాంధీ డైరెక్ట్ చేసిన `ర‌క్ష‌కుడు` 1997 లో విడుద‌లైన సస్పెన్స్‌ క్రైమ్‌ థిల్లర్. ఇందులో నాగార్జున హీరోగా న‌టించ‌గా..  మిస్ యూనివర్స్ అందాల పోటీ విజేత అయిన సుస్మితా సేన్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందించాడు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ర‌క్ష‌కుడు మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద అట్ట‌ర్ ఫ్లాప్‌గా నిలిచింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: