కకమల్ హాసన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఈయన ప్రస్తుతం థగ్ లైఫ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో కమల్ హాసన్ మాట్లాడుతూ.. 'తెలుగులో నేను 15 సినిమాలలో నటించాను.. అందులో 13 సినిమాలు మంచి హిట్ ని అందుకున్నాయి. మంచి మూవీస్ మీకు అందించడం నా బాధ్యత. అందుకే తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికి మరోసారి థగ్ లైఫ్ మూవీతో వస్తున్నాను. వైజాగ్ ప్రజలు నన్ను చాలా ఆదరించారు. నేను 21 ఏళ్లు ఉన్నప్పుడు వైజాగ్ కి వచ్చాను. అసలు నా మొఖం కూడా ఎవరికి తెలీదు. షూటింగ్ జరిగి సినిమా రిలీజ్ అయ్యాక ఎక్కడ లేని ఫ్యాన్ బేస్ ని చూశాను. ఇక్కడి ప్రేక్షకులు నన్ను ఎంతగానో సప్పోర్ట్ చేశారు. ఇక్కడే నేను మరోచరిత్ర, సాగర సంగమం, ఏక్ తుజే కేలియే, శుభసంకల్పం మూవీస్ చేశాను. ఇది నాకు సొంత ఇల్లు లాంటిది. శింబు, త్రిష, నాజర్, అభిరామి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తప్పకుండా మీకు నచ్చుతుంది. జూన్ 5న అందరం థియేటర్ లలో కలుద్దాం' అని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలో ఇంద్రాణి పాత్రలో త్రిష నటిస్తుందని చెప్పుకొచ్చింది. తప్పకుండా ఆడియన్స్ కి గుర్తుండిపోయే పాత్ర అని తెలిపింది. తాను ఇన్ని ఏళ్లుగా ఇలాంటి పాత్ర చేయలేదని స్పష్టం చేసింది. థగ్ లైఫ్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక ముఖ్యమైన ఫిల్మ్ అవుతుందని నటుడు నాజర్ చెప్పుకొచ్చారు.
థగ్ లైఫ్ మూవీలో హీరోయిన్ గా త్రిష నటిస్తున్నారు. అలాగే థగ్ లైఫ్ సినిమాలో హీరో శింబు కూడా ముఖ్యపాత్ర పోషించనున్నారు. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి, సానియా మల్హోత్రా, జోజు, అభిరామి, నాజర్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. థగ్ లైఫ్ సినిమా జూన్ 5వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా గ్యాంగ్ స్టార్ చరిత్రను చూపించే విధంగా రూపొందింది. ఇటీవలే థగ్ లైఫ్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.