తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు కలిసి ఉన్న సమయం లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తె లుగు సినీ పరిశ్రమ సినిమాలకు గాను నంది అవార్డులను ఇచ్చేవా రు. దానికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ఆ తర్వాత ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రం రెం డు గా విడిపోయిన తర్వాత నంది అవార్డులను ఇవ్వడం దాదాపుగా మానేశా రు . ఇకపోతే చాలా కాలం నుండి తెలంగాణ ప్రభు త్వం నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ఇవ్వను న్నట్లు ప్రకటిస్తూ వచ్చింది . తాజాగా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం 2024 వ సంవత్సరానికి గాను మంచి ప్రతిభ కనబరిచిన నటీ నటులకు , టెక్నీషియన్స్ కు గద్దర్ అవార్డులను ప్రకటించింది.

అందులో భాగంగా 2024 లో తమ అద్భుతమైన నటనను కనబరిచి గద్దర్ అవార్డులను దక్కించుకున్న నటి నటులు ఎవరు అనేది తెలుసుకుందాం. ఇకపోతే 202 4వ సంవత్సరానికి గాను గద్దర్ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా పుష్ప పార్ట్ 2 మూవీ లోని నటనకు గాను అల్లు అర్జున్ కు బెస్ట్ నటుడి అవార్డు దక్కింది. ఇకపోతే బెస్ట్ నటి అవార్డు 35 చిన్న కథ కాదు సినిమాలోని నివేద థామస్ కి దక్కింది. ఇకపోతే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరిలో సరిపోదా శనివారం సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటించిన ఎస్ జె సూర్య కి అవార్డు దక్కింది. ఇకపోతే బెస్ట్ సపోర్టింగ్ నటి కేటగిరీలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలోని తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శరణ్య ప్రదీప్ కు అవార్డు వచ్చింది. ఇలా 2024 వ సంవత్సరానికి గాను గద్దర్ అవార్డుల్లో ఈ నలుగురి నటులకు బెస్ట్ యాక్టింగ్ కేటగిరీలో అవార్డులు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: