
ఇక ధనుష్ కొడుకు యాత్ర తన స్కూల్ విద్యను పూర్తిచేశాడు .. తాజాగా తన స్కూల్లో జరిగిన స్నాతకోత్సవానికి తన మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ తో కలిసి హాజరయ్యాడు .. ఈ సందర్భంగా తన కొడుకును కౌగిలించుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు .. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రౌడ్ పేరెంట్స్ అంటూ అందులో రాస్కొచ్చారు .. ధనుష్ , ఐశ్వర్య విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత తమ కొడుకు గ్రాడ్యుయేషన్ వేడుకలు ఇద్దరు ఆనందంగా కనిపించడం చూసి అభిమానులు ఎంతగానో ఆనందపడుతున్నారు .. ప్రస్తుతం ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు .
ఇక ప్రస్తుతం ధనుష్ దర్శకత్వం వహించి నటించిన ఇడ్లీ కడైచిత్రం విడుదలకు రెడీగా ఉంది .. ప్రస్తుతం ఆయన ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా తేరే ఇష్క్ మై లో హీరోగా కూడా నటిస్తున్నారు .. ఆ తర్వాత అమరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరి స్వామి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నారు .. అలాగే లప్పర్ బందు దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించే ప్రాజెక్టులు కూడా చేయనున్నారు .. ఇక ఇవే కాకుండా డైరెక్టర్ ఓంరౌత్ తెర్కక్కించే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బయోపిక్ లో కూడా ధనుష్ నటించనున్నారు . వీటితో పాటు వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ సినిమా కూడా చేయబోతున్నాడు . ఇదే క్రమంలో ధనుష్ ఐశ్వర్య రజినీకాంత్ విడాకులు ఇచ్చిన తర్వాత .. ఇప్పటివరకు ఆమెతో కలిసి కనిపించింది లేదు .. ఇప్పుడు తన కొడుకు గ్రాడ్యుయేషన్కు సంబంధించిన ఈవెంట్లో కలిసి ఆమెకు భారీ షాక్ ఇచ్చాడు .. ఇప్పటికే ధనుష్ రెండో పెళ్లి చేసుకోబోతున్నడు అంటూ వార్తలు వస్తున్న సమయంలో ఇప్పుడు ఐశ్వర్య రజినీకాంత్ తో ధనుష్ కలిసి కనిపించడం కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ..