ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మ‌ణిర‌త్నం ఒక లెజెండ‌రీ డైరెక్ట‌ర్. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌ర్క్ చేయాల‌ని పెద్ద పెద్ద స్టార్స్ కూడా త‌హ‌త‌హ‌లాడుతుంటారు. అంత‌టి క్రేజ్ ఆయ‌న సొంతం. తాజాగా మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన `థ‌గ్ లైఫ్‌` మూవీ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. అద‌లా ఉంచితే.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌ణిర‌త్నం తీసిన చిత్రాల్లో టాప్‌-5 బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


1. నాయకన్.. ముంబయిలో తమిళ మాఫియా నాయకుడిగా ఎదిగిన వ్యక్తి జీవితం ఆధార‌ణంగా మ‌ణిర‌త్నం ఈ సినిమాను తీశారు. కమలహాసన్ క‌థ‌నాయకుడిగా న‌టించిన ఈ చిత్రం 1987లో విడుద‌లై ఆల్ టైమ్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా, క‌ల్డ్ క్లాసిక్‌గా నిలిచింది. టైమ్ మ్యాగజైన్ యొక్క `ఆల్ టైమ్ టాప్ 100 ఫిల్మ్స్` లో స్థానం సంపాదించుకుంది. 8.6 ఐఎండీబీ రేటింగ్ తో టాప్ స్థానంలో నిలిచింది.


2. ద‌ళ‌ప‌తి.. ఇద్ద‌రు ప్రాణ స్నేహితుల చుట్టూ తిరిగే సినిమా ఇది. రజనీకాంత్, మ‌మ్ముట్టి హెయిన్ లీడ్స్ గా యాక్స్ చేశారు. 1991లో రిలీజ్ ద‌ళ‌ప‌తి ర‌జ‌నీ కెరీర్ ను మ‌లుపు తిప్పిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీకి 8.5 ఐఎండీబీ రేటింగ్ ఉంది.


3. మౌన‌రాగం.. రేవతి, మోహన్, కార్తీక్ లాంటి వాళ్లు నటించిన ఈ చిత్రం 1986లో విడుదలై భారీ విషయాన్ని నమోదు చేసింది. ప్రేమికుడ్ని కోల్పోయిన ఓ యువతి.. మరొకరిని వివాహం చేసుకొని అతనితో అడ్జస్ట్ కావడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసింది అన్నది ఈ మూవీ స్టోరీ. ఐఎండీబీలో ఈ చిత్రానికి 8.4 రైటింగ్ ఉంది.


4. గీతాంజలి.. మ‌ణిర‌త్నం తెలుగులో నేరుగా తీసిన ఒకే ఒక్క చిత్రం. చ‌నిపోతామ‌ని తెలిసి కూడా ప్రేమ‌లో ప‌డే ఓ యువ జంట క‌థ ఇది. నాగార్జున‌, గిరిజ ఇందులో హీరో, హీరోయిన్లుగా న‌టించారు. టాలీవుడ్ లో అత్యంత ఘ‌న విజ‌యం సాధించిన చిత్రాల్లో గీతాంజ‌లి ఒక‌టి. ఐఎండీబీలో 8.3 రేటింగ్ ఉన్న గీతాంజ‌లిని ఇప్ప‌టికీ చూడ‌క‌పోతే లైఫ్ వేస్ట్ అని అంటారు సినీ ప్రియులు.


5. రోజా.. కాశ్మీర్‌లో మిస్సింగ్ అయిన భర్తను వెతికే భార్య కథ ఇది. అర‌వింద్ స్వామి, మధుబాల జంట‌గా న‌టించిన ఈ చిత్రం 1992లో విడుద‌లై పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. దేశభక్తి, ప్రేమ, సంగీతం అన్నీ కలిసిన అద్భుతమే రోజా. ఈ చిత్రానికి ఐఎండీబీలో 8.1 రేటింగ్ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: