
50 ఏళ్ల ఫిల్మ్ కెరీర్ లో బాలకృష్ణ హీరోగా ఎన్నో చిత్రాలు చేశారు. మరెన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. అలాగే దర్శకుడుగా కూడా రెండు సినిమాలకు పని చేశారన్న సంగతి మీకు తెలుసా? పైగా ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఒకటి హిట్.. మరొకటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇంతకీ ఆ సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
పెద్దన్నయ్య.. 1997లో విడుదలైన ఫ్యామిలీ డ్రామా ఇది. శరత్ డైరెక్టర్ కాగా.. ఇంద్రజ, రోజా హీరోయిన్లుగా నటించారు. కోటి సంగీతం అందించారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. పెద్దన్నయ్య క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తాన్ని బాలయ్యనే డైరెక్ట్ చేశారు. కట్ చేస్తే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.
ఆ తర్వాత బాలకృష్ణకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి`. బాలయ్య కెరీర్ లో100వ ప్రాజెక్టు ఇది. శ్రియా సరన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడినే దర్శకుడు అయినప్పటికీ.. కొన్ని సన్నివేశాలకు మాత్రం బాలయ్యనే దర్శకత్వం వహించారు. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి కోసం పడినంత కష్టం బాలయ్య తన కెరీర్ లో మరే చిత్రానికి పడలేదు. ఇక 2017లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి వసూళ్లతో క్లీన్ హిట్ గా నిలిచింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు