టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది నిర్మాతలు ఉన్నా దిల్ రాజు ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా సినిమాలను నిర్మించే దిల్ రాజుకు ఈ ఏడాది గేమ్ చేంజర్ సినిమాతో భారీ షాక్ తగిలింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఘన విజయం సాధించడంతో దిల్ రాజుకు ఊరట దక్కింది.

అయితే మరికొన్ని రోజుల్లో తమ్ముడు సినిమాతో  దిల్ రాజు నిర్మాతగా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారీ క్యాస్టింగ్ తో ఈ సినిమా తెరకెక్కగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల నిర్మాతలు యూట్యూబ్ వ్యూస్ కొంటున్న సంగతి తెలిసిందే. ఈ విధంగా వ్యూస్ కొనడం విషయంలో  భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సినిమాపై అంచనాలు పెంచడం కోసమే నిర్మాతలు వ్యూస్ కొంటున్నారు.

అయితే తమ్ముడు సినిమా ట్రైలర్ కు మాత్రం తాను వ్యూస్ కొనడం లేదని  దిల్ రాజు స్పష్టత ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి నా వ్యూస్ ఒరిజినల్ అని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. డబ్బులు పెట్టి మిలియన్ వ్యూస్ కొనొద్దని నా టీమ్ కు క్లియర్ గా చెప్పానని ఆయన అన్నారు.  అలా కొనడం వాళ్ళ ట్రైలర్ ఎంతమందికి జెన్యూన్ గా  రీచ్ అయిందో తెలియడం లేదని   దిల్ రాజు కామెంట్లు చేశారు.

తాను తమ్ముడు సినిమాతో ఈ దిశగా తొలి  అడుగు వేశానని దిల్ రాజు కామెంట్లు చేశారు.  తమ్ముడు సినిమాకు ఇప్పటివరకు కేవలం 1.4 మిలియన్ల వ్యూస్ మాత్రమే వచ్చాయి. అయితే దిల్ రాజు తీసుకున్న నిర్ణయం  సినిమాకు ప్లస్ అవుతుందో లేదో  చూడాల్సి  ఉంది.  దిల్ రాజు దారిలో ఇతర నిర్మాతలు సైతం అడుగులు వేస్తారా అనే చర్చ జరుగుతోంది. తమ్ముడు సినిమా సక్సెస్ సాధించడం  నితిన్ కు కీలకం  అనే సంగతి  తెలిసిందే.  నితిన్ కొత్త ప్రాజెక్ట్స్ కు సంబంధించి  త్వరలో స్పష్టత రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: