`చిన్నారి పెళ్లికూతురు` సీరియ‌ల్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ప్ర‌ముఖ న‌టి అవికా గోర్ త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌బోతుంది. తాజాగా ప్రియుడు మిలింద్ చాంద్వానీతో అవికా గోర్ నిశ్చితార్థం జ‌రిగింది. బుధ‌వారం కుటుంబ‌స‌భ్యులు, అత్యంత స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఈ వేడుకను నిర్వ‌హించారు. ఎంగేజ్మెంట్ ఫోటోల‌ను అవికా గోర్ స్వ‌యంగా ఇన్‌స్టాలో పోస్ట్ చేయ‌డంతో.. ఫ్యాన్స్ మ‌రియు ప‌లువురు సెల‌బ్రిటీలు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.


మిలింద్ చాంద్వానీ బ్యాక్‌గ్రౌండ్ విష‌యానికి వ‌స్తే.. ఇత‌ను వ్యాపార‌వేత్త మ‌రియు సామాజిక కార్య‌క‌ర్త‌. అంత‌కుముందు మిలింద్ ఓ కార్పొరేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా వ‌ర్క్ చేసేవాడు. అనంత‌రం వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. క్యాంప్ డైరీస్ పేరుతో ఓ ఎన్జీవోను కూడా ర‌న్ చేస్తున్నాడు. 2019లో ఓ ప్ర‌ముఖ టీవీ ఛానెల్‌లో ప్రసార‌మైన `రోడీస్ రియ‌ల్ హీరోస్` షోలో మిలింద్ పాల్గొన్నాడు. ఈ షో అత‌డ్ని బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గానో క‌నెక్ట్ చేసింది. కానీ ఆ త‌ర్వాత ఎంట‌ర్‌టైన్మెంట్ వ‌ర‌ల్డ్‌లో మిలింద్ ఎప్పుడూ క‌నిపించ‌లేదు.


మిలింద్ చాంద్వానీ, అవికా గోర్ హైద‌రాబాద్ లో ఓ కామ‌న్ ఫ్రెండ్ ద్వారా క‌లుసుకున్నారు. త‌క్కువ స‌మ‌యంలోనే మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వారి స్నేహం క్ర‌మంగా ప్రేమ‌గా మారింది. దాదాపు ఐదేళ్ల నుంచి వీరిద్ద‌రూ డేటింగ్ లో ఉన్నారు. 2020లో ప్రియుడ్ని ప‌రిచ‌యం చేసిన అవికా గోర్.. ఇప్పుడు పెద్ద‌ల అంగీకారంతో అత‌నితో ఏడ‌డుగులు వేసేందుకు రెడీ అయింది. ఈ ఏడాది చివ‌రిలో అవికా గోర్‌, మిలింద్ వెడ్డింగ్ ఉండొచ్చ‌ని అంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: