తెలుగు సినిమాలలో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించిన వారు ఉన్నారు.అలాంటి వారిలో అతి తక్కువ సమయంలో మంచి విజయాలను అందుకొని విభిన్నమైన పాత్రలలో నటించిన నటుడు మురళీ శర్మ గురించి చెప్పాల్సిన పనిలేదు. సహజమైన నటనకు గుర్తింపు సంపాదించుకున్న మురళి శర్మ విలన్ గా పలు చిత్రాలలో తండ్రిగా అద్భుతమైన పాత్రలలో నటించారు. అలా వైకుంఠపురం సినిమాలో ఈయన పాత్ర సినిమాకి హైలైట్ గా మారింది. ప్రస్తుతం తెలుగులో ఎన్నో చిత్రాలలో నటిస్తూ ఉన్న మురళి శర్మ భార్య కూడా నటి అన్న సంగతి చాలా మందికి తెలియక పోవచ్చు. మరి ఆమె గురించి చూద్దాం.


మొదట మురళి శర్మ పలు సీరియల్స్ లో నటించేవారు ఆ తర్వాత మహేష్ బాబు నటించిన అతిధి చిత్రంలో విలన్గా ఎంట్రీ ఇచ్చారు. అలా ఇప్పటికి పలు చిత్రాలలో నటిస్తూ ఉన్న మురళీ శర్మ భార్య కూడా హిందీ సీరియల్స్ లో తోపు నటి అన్నట్లుగా తెలుస్తోంది. మురళి శర్మ భార్య పేరు అశ్విన్ కల్ శేఖర్. ఈ నటి అల్లు అర్జున్ నటించిన బద్రీనాథ్  చిత్రంలో విలన్ భార్యగా కనిపించింది. ఈ చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్న ఈమె మరాఠీ, హిందీ వంటి సినిమాలలో నటిస్తూ సీరియల్స్ లో కూడా నటిస్తోంది.అశ్విన్ కల్ శేఖర్ నిప్పు, మెహబూబా వంటి చిత్రాలలో కూడా నటించింది. అయితే తెలుగులో ఈమె నటించిన సినిమాలు కూడా ఈమె సక్సెస్ కు పునాది వేయలేకపోయింది. అందుకే తెలుగులో అవకాశాలు పెద్దగా రావడం లేదు.


ప్రస్తుతం హిందీ బుల్లితెర పైన బిజీ నటిగా కొనసాగుతోంది. మొత్తానికి నటుడు మురళీ శర్మ భార్య కూడా  తెలుగు సినిమాల లో నటించింది అన్న సంగతి చాలామందికి తెలియకపోవడంతో ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆమె నటించిన చిత్రాలలో యాక్టింగ్ తో అందరిని బాగా ఆకట్టుకున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: