
అయితే సినిమా విడుదలై 9 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా 50 కోట్ల రూపాయలను కూడా రాబట్టలేకపోతోందనే విధంగా ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. కమలహాసన్ థగ్ లైఫ్ సినిమా ఎలాంటి కష్టాలలో పడిందో చెప్పవచ్చు. ఈ వసూళ్ల ప్రభావం ఓటిటి స్త్రిమ్మింగ్ రైట్స్ కు భారీ దెబ్బ కలిగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..థగ్ లైఫ్ సినిమా డిజిటల్ హక్కును నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది దాదాపుగా రూ .130 కోట్లకు పైగా ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా నిర్మాతలకు నెట్ ఫ్లిక్స్ షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
థగ్ లైఫ్ సినిమాకి సంబంధించి స్ట్రీమింగ్ ఒప్పంద విషయంలో తిరిగి చర్చలు జరపబోతున్నట్లు తమిళ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 130 కోట్ల రూపాయల నుంచి 20 నుంచి 25% వరకు తగ్గింపు అంగీకారంతో నెట్ ఫ్లిక్స్ నిర్మాతల ముందు అంశాన్ని తీసుకువచ్చినట్లు సినీవర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అంటే సుమారుగా 30 కోట్ల రూపాయల వరకు తగ్గిస్తేనే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ట్రిమ్మింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు కరాకండిగా తెలియజేసిందట నెట్ ఫ్లిక్స్. టీవీ శా టిలైట్ ని 60 కోట్ల రూపాయల వరకు కొనుగోలు చేశారు. కానీ నెట్ఫ్లిక్స్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కమలహాసన్ కు 30 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లుగా కనిపిస్తోందట. ఆగస్టు 15 స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా అంతకంటే ముందే వచ్చేలా కనిపిస్తోందట.