
చాలామంది హీరోలు లా బాలీవుడ్ టాప్ హీరో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడు. అందువల్ల సామాజిక విషయాల పై ప్రముఖ సంఘటనల పై అమీర్ ఖాన్ స్పందన ఉండదు. ఈవిషయంలో అమీర్ ఖాన్ ను టార్గెట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈమధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ విషయమై దేశవ్యాప్తంగా ఎంతోమంది సెలెబ్రెటీలు స్పందించినప్పటికీ అమీర్ ఖాన్ నుండి స్పందన రాకపోవడంతో అతడి దేశభక్తిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో అతడి పై చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు.
ఇప్పుడు ఆవిషయాల పై అమీర్ ఖాన్ ఒక ఇంటర్యూలో స్పందించి తన అభిప్రాయాలను తెలియచేశాడు. తాను తీసిన ‘మంగళ్ పాండే’ ‘లగాన్’ సినిమాలలో దేశభక్తి అంతర్లీనంగా ఉన్న విషయాన్ని తన పై నెగిటివ్ విమర్శలు చేస్తున్న వారు మారిచిపోయారా అంటూ అమీర్ ఖాన్ తనదైన రీతిలో స్పందించాడు. అంతేకాదు తాను నిర్వహించిన ‘సత్యమేవ జయతే’ రియాలిటీ షోలో అనేక సామాజిక అంశాలను ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకు వచ్చిన విషయం మర్చిపోయారా అంటూ తన విమర్శకులను ప్రశ్నిస్తున్నాడు అమీర్ ఖాన్.
మరి కొద్దిరోజులలో విడుదల కాబోతున్న ‘సితారే జమీన్ పర్’ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీర్ ఈ కామెంట్స్ చేశాడు. గత కొంతకా లంగా వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న అమీర్ ఖాన్ కు ఈమూవీ ఘన విషయం అత్యంత కీలకం. సాధారణంగా అమీర్ ఖాన్ నుండి సినిమా వస్తున్నప్పుడు ఆమూవీ పై భారీ అంచనాలు ఉంటాయి.
అయితే ఈసినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నప్పటికీ ఈమూవీ పై క్రేజ్ సగటు ప్రేక్షకులలో కనిపించక పోవడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మాస్ అప్పీల్ లేని కథ కావడం పాటలు అంతగా బాగా లేకపోవడం ఇప్పటికే విడుదలైన ఈమూవీ ట్రైలర్ మీద నెగటివ్ కామెంట్స్ రావడంతో అమీర్ ఖాన్ కు ఈసినిమా కూడ నిరాశ మిగులుస్తుందా అన్న అభిప్రాయాలను బాలీవుడ్ మీడియా వ్యక్త పరుస్తోంది..