ఈ మధ్యకాలంలో బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు. రిలీజ్ అయిన సినిమాలు కూడా తుస్సు మంటూ పేలిపోయాయి . ఇంకా పక్కాగా చెప్పాలి అంటే పుష్ప2 సినిమా తర్వాత ఆ రేంజ్ లో సందడి చేసిన సినిమా "సంక్రాంతికి వస్తున్నాం" మాత్రమే . ఆ తర్వాత పెద్దగా సినిమాలు ఏవి ఆకట్టుకోలేకపోయాయి . నాని హిట్  3 సినిమా హిట్ అయిన అది మొత్తం యాక్షన్ సీన్స్ పరంగా ముందుకు వెళ్లిపోయింది . ఆ తర్వాత ఇది మన తెలుగు సినిమా అంటూ కాలర్ ఎగరేసి చెప్పుకునే అంత సినిమా ఏది తెరకెక్కించలేకపోయారు డైరెక్టర్లు . ఇప్పుడు "కుబేర" సినిమా ఆ క్రేజీ స్థానాన్ని అందుకునేసింది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా హీరోయిన్ రష్మిక మందన్నా  కీలకపాత్రలో నాగార్జున నటించిన ఈ కుబేర సినిమా కొద్దిసేపటి క్రితమే  థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.  ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది.  ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో కుబేర సినిమాపై పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి . మరి ముఖ్యంగా ధనుష్ పెర్ఫార్మన్స్ కి అయితే వేరే లెవెల్ ప్రశంసలు దక్కుతున్నాయి . దీన్నంతటికీ కారణం శేఖర్ కమ్ముల డైరెక్షన్ అని కూడా అంటున్నారు . సినిమా కథ బాగుంది .. పాటలు బాగున్నాయ్.. సెంటిమెంట్ సీన్స్ బాగున్నాయ్..సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంత చక్కగా తెరకెక్కించారు .

కానీ సినిమా చూసిన జనాలకు మాత్రం అబ్బా అని కొన్నిచోట్ల అనిపిస్తూ ఉంటుంది . సీన్స్ లొ సీన్స్ కి కనెక్ట్ చేయడంలో శేఖర్ కమ్ముల కొంచెం తడబడ్డాడు అంటున్నారు సినీ ప్రముఖులు.  కొన్ని కొన్ని చోట్ల సినిమా కథ చాలా స్లోగా సాగుతుంది . కధ అంతా ఇంట్రెస్టింగ్ గా వెళ్తున్నప్పుడు సడన్ గా ఎక్కడో బ్రేక్ పడినట్లు అనిపిస్తుంది అంటున్నారు సినిమా ప్రముఖులు . అది తప్పిస్తే సినిమాకి మరి ఏం  మైనస్ పాయింట్ లేదు అని..  అక్కడక్కడ కథ స్లోగా ఉండడం మాత్రమే ఈ సినిమాకి బిగ్ మైనస్ గా మారింది అని మిగతాదంతా వెరీ వెరీ గుడ్ అంటూ సినీ ప్రముఖుల శేఖర్ కమ్ముల పై ప్రశంసలు కురిపించేస్తున్నారు.  మొత్తానికి శేఖర్ కమ్ముల "కుబేర" సినిమాతో క్రేజీ హిట్  ఖాతాలో వేసుకున్నాడు.  చూడాలి మరి కుబేర సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: