
నిజానికి శేఖర్ కమ్ముల తెలుగు డైరెక్టర్. ఒకవేళ శేఖర్ కమ్ముల మన తెలుగు హీరోలతో ఎవరితో ఈ కథని తెరకెక్కిస్తే బాగుండేది అంటూ మాట్లాడుకుంటున్నారు. ధనుష్ ఈ క్యారెక్టర్ కి 100% సూట్ అయ్యాడు . బాగుంది ..కానీ ధనుష్ కాకుండా మన తెలుగు ఇండస్ట్రీలో ఈ క్యారెక్టర్ కి సూట్ అయ్యే హీరో ఎవరు..? అంటూ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటున్నారు . ఏ అభిమాని తమ ఫేవరెట్ హీరో పేరుని ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు . కాగా చాలామంది జనాలు మాత్రం ఎక్కువగా సపోర్ట్ చేసింది అల్లు అర్జున్ - రామ్ చరణ్ లకే.
ఇలాంటి స్టన్నిమ్హ్ పాత్రల కు అల్లు అర్జున్ - రామ్ చరణ్ అయితే బాగా సూట్ అవుతారు అని .. సినిమా కోసం ఏమైనా చేయగలరు ఈ నటులు అంటూ ఇద్దరు హీరోల పేర్లను బాగా ట్రెండ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న హీరోలలో ఈ పాత్రకు న్యాయం జరిగే చేయగలిగే హీరోలు మాత్రం అల్లు అర్జున్ - రామ్ చరణ్ అంటూ జనాలు మాట్లాడుకుంటూ ఉండటం గమనార్హం. మరోక పక్క ఈ క్యారెక్టర్ కి నాగ చైతన్య కూడా బాగా సూట్ అవుతాడు అని అక్కినేని ఫ్యాన్స్ చెపుతున్నారు. ఇంకా లిస్టులో చాలామంది హీరోలే ఉన్నారు . ప్రభాస్ - జూనియర్ ఎన్టీఆర్ - మహేష్ బాబు - నాని ఇలా పెద్ద పెద్ద హీరోకు పేర్లు లిస్టులో ఉన్నాయి..!!