టాలీవుడ్ లో స్టార్ హీరో అవ్వాల్సిన వాడు కానీ కొన్ని తప్పుల వల్ల కెరీర్ పిక్స్ లో ఉన్న టైమ్ లోనే ఫేడౌట్ అయ్యారు జై ఆకాశ్. ఈయన అసలు పేరు సతీష్ నాగేశ్వరన్. లండన్ లో స్థిరపడిన శ్రీలంక తమిళ కుటుంబం నుంచి వచ్చిన జై ఆకాశ్‌.. `రోజావనం` అనే తమిళ చిత్రంతో హీరోగా వెండితెరపై అడుగు పెట్టాడు. తెలుగులో జై ఆకాశ్‌ తొలి చిత్రం `రామ్మా చిలకమ్మా`. ఇందులో సైడ్ హీరోగా చేసిన జై ఆకాశ్‌.. అ వెంటనే `ఆనందం` సినిమాలో మెయిన్ హీరోగా నటించారు. శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. థియేట‌ర్స్ లో 200 రోజులు ఆడి రికార్డులు క్రియేట్ చేసింది. ఈ మూవీతో ఆకాష్ ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మారాడు.


దాంతో తెలుగులో ఆయ‌న‌కు ఆఫర్లు క్యూ కడ్డాయి. అటు తమిళ్ ఇండస్ట్రీలోనూ బిజీ యాక్టర్ గా మారాడు. కన్నడ, హిందీ పరిశ్రమల్లో కూడా సినిమాలు చేశాడు. నంది అవార్డుతో సహా పలు పరిష్కారాలు అందుకున్నాడు. కానీ టాలీవుడ్ లో ఎక్కువ కాలం హీరోగా రాణించలేకపోయాడు. అందుకు కారణం ఆకాశ్‌ ఆటిట్యూడ్ అన్న టాక్ ఉంది. ఒక హిట్టు పడగానే స్టార్ హీరో అన్న ఫీల్ తో దర్శక నిర్మాతల దగ్గర గొంతెమ్మ కోరికలు కోరేవాడట. తన సినిమాలో సోనాలి బింద్రే, సిమ్రాన్ వంటి స్టార్ హీరోయిన్లనే తీసుకోవాలని డిమాండ్ చేసేవాడిట. జై ఆకాశ్‌ తీరుకు విసిగిపోయిన తెలుగు దర్శక నిర్మాతలు మెల్లగా ఆయన్ను పక్కన పెట్టడం ప్రారంభించారు.


అవకాశాలు తగ్గిపోవడం నటించిన సినిమాలు రిలీజ్ కాకపోవడంతో టాలీవుడ్ లో హీరోగా ఆకాశ్ కెరీర్ పాతాళానికి పడిపోయింది. దానికి తోడు నిర్మాతగా జై ఆకాశ్ గట్టిగానే చేతులు కాల్చుకున్నారు. నిర్మాణ రంగంలో అడుగుపెట్టి సంపాదించుకున్న ఆస్తుల‌తో పాటు ఉన్న ఆస్తులు కూడా పోగొట్టుకున్నారు. ఆర్థికంగా చాలా నష్టపోయారు. 2016 నుంచి తెలుగు సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైన జై ఆకాష్.. తమిళంలో అడపా ద‌డ‌పా చిత్రాలు చేస్తున్నారు. అలాగే బుల్లితెరపై సీరియల్స్‌ చేయడం కూడా ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: